logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

దెయ్యం పట్టిందని బాలింత మహిళకు చిత్రహింసలు.. పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్తింటివారిఇంటి మూఢనమ్మకం బాలింత మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. దెయ్యం వదిలిస్తానని చెప్పి బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలు గడవని ఆ మహిళను విచక్షణారాహిత్యంగా కొట్టాడో దుర్మార్గుడు. ఇప్పుడా మహిళ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. కాగా ఈ ఘటనకు కారణమైన భూత వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసారు.

జైపూర్ మండలం కుందారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు రజిత చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న సమయంలో ఆమెకు మంచిర్యాలకు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ గతేడాది పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్ళైన రోజు నుండీ రజిత అనారోగ్యానికి గురవుతుంది.

ఇటీవలే ఆమె ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే రజిత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన భర్త, అత్తగారి కుటుంబ సభ్యులు, రజిత మేనమామ ఓ భూత వైద్యుడిని పిలిపించారు. అతను రజితకు దెయ్యం వదిలిస్తానని ఆమెని విచక్షణారహితంగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె దెయ్యం వదిలిందని వేడుకున్నా అతను వినలేదు.

జుట్టు పట్టుకుని కొట్టడంతో ఆమె చిత్రహింసలు తాళలేక కొంతసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీం నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రజిత చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంది. ఈ ఘటనపై స్థానికుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. భూత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News