logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

వివాహేతర సంబంధం.. భార్యను కొట్టి చంపిన మాజీ సైనికుడు!

వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు భర్త చేతిలో అర్థాంతరంగా తనువు చాలించింది ఓ ఇల్లాలు. తమిళనాడు వేలూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. కమ్మవాన్ పేటకు చెందిన సెల్వం కు చిత్ర(36)తో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు సంతానం.

సెల్వం కొన్నేళ్లుగా సైన్యంలో పని చేసి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. స్థానికంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య చిత్రకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. భర్త తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగడంతో అనుమానం వచ్చిన సెల్వం భార్యను మందలించాడు. అయినా ఆమె వినిపించుకోలేదు.

ఈ నెల 7వ తేదీన చిత్ర యువకుడితో కలిసి బయటకు వెళ్లి వచ్చింది. గమనించిన కూతురు తల్లిని ఈ పని మానుకోవాలని తెలిపింది. ఇంటికొచ్చిన తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో ఇంట్లో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. అదే రోజు అర్థరాత్రి సెల్వం ఆవేశంతో భార్య తలపై కర్రతో కొట్టాడు. తలకు తీవ్ర రక్త స్రావం కావడంతో చిత్ర అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్వం ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Related News