logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. ఊరివాళ్లకు తెలిసిపోయిందని దారుణం

అక్రమ సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నెలకుంది. ఓ మహిళ వరుసకు అల్లుడయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించింది. విషయం ఊరి వాళ్లకు తెలిసిపోవడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.

వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా బౌసింగ్‌ తండా గ్రామపంచాయతీ వంపుతండాలో చోటుచేసుకుంది. దేవమ్మ అనే మహిళకు పదేళ్ల క్రితం రాజుతో వివాహం జరిగింది. రాజు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా దేవమ్మకు అల్లుడు వరసయ్యే శివనాయక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త ఇంట్లో లేని సమయం చూసి దేవమ్మ శివనాయక్ లు చాటుగా కలిసే వారు.

ఈ విషయం కొంత మంది ద్వారా ఊరి జనాలకు తెలిసిపోయింది. దీంతో దేవమ్మ ఊర్లో తలెత్తుకోలేకపోయింది. అవమాన భారంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు శివనాయక్ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి శుక్రవారం రాత్రి కొన్నూరు క్రాస్‌ రోడ్డు వద్ద పెద్దతొక్కుడోని బండపై పురుగు మందు తాగి ఆత్మహత్య కు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related News