logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

అక్రమ సంబంధమే కారణమంటూ.. మహిళ ఆత్మహత్య!

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన లహరి(32) నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెకీ గా పనిచేస్తుంది. 8 ఏళ్ల క్రితం జెట్ ఎయిర్ వేస్ పైలట్ వెంకటేష్ తో ఆమెకు వివాహం జరిగింది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు రేపింది.

దానికి తోడు ఏడేళ్లు గడుస్తున్నా లహరికి పిల్లలు పుట్టకపోవడంతో భర్త తరచూ వేధించేవాడు. తాజాగా పరాయి స్త్రీతో భర్త తిరుగుతుండటం చూసి ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. శుక్రవారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తన చావుకు తన భర్తే కారణమని వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా వెంకటేష్ పై లహరి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పెళ్లి సమయంలో లక్షలకు లక్షలు కట్నం తీసుకున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడి నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఆమెను చిత్రహింసలకు గురి చేసాడు. చివరకు తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అతన్ని బహిరంగంగా ఉరికి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా వెంకటేష్ లహరిపై దాడి చేసిన వీడియోలు రికార్డు కావడంతో ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News