logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

దారుణం: యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఉన్మాదులు

యువతిపై కొందరు ఉన్మాదులు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించే సమయానికే యువతి మంటల్లో కాలిపోయి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే .. మండల పరిధిలోని బండ్రుగొండ నుంచి పూసుగూడెంవైపు వెళ్లే అటవీ ప్రాంతంలో సగం కాలిన యువతి మృతేదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంపై ఉన్న దుస్తులు కూడా సగానికి పైగా కాలిపోయి అర్థనగ్నంగా యువతి మృతదేహం కనిపించింది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెపై ఎవరో పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా అనుమానిస్తున్నారు. కాగా ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వెనుక కారణాలను విశ్లేషిస్తున్నారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారం ఏదైనా కారణం అయ్యుంటుందా లేక ఎక్కడి నుంచైనా యువతిని అపహరించి తీసుకొచ్చి అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ముఖం, శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి ఉండటంతో ఆమెను గుర్తించడం కష్టంగా మారింది. అయితే అక్కడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన గిరిజన యువతి అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Related News