కొన్ని ప్రాంతాల్లో ఉండే సంప్రదాయాలు, పాటించే పద్ధతులు మిగతా సభ్య సమాజానికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఈ కాలంలో కూడా ఇలాంటి పద్ధతులు ఉన్నాయా అనే అశ్చర్యం వ్యక్తమవుతుంది. అయితే, ఆర్థిక అసమానతలు, సామాజిక దురాచారాల వల్ల కొన్ని ఉండకూడని పద్ధతులు ఇంకా అనేక చోట్ల కొనసాగుతున్నాయి. ఇటువంటి ఒక సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఉంది. ఇక్కడి ఒక తెగకు చెందిన కొందరు ప్రజలు భార్యలను అద్దెకు ఇస్తుంటారు. వినడానికే ఇబ్బందికరంగా ఉన్నా కూడా, ఇప్పటికీ ఈ సంప్రదాయం బహిరంగంగానే కొనసాగుతోంది.
శివపురి జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ తెగలో భార్యలను అద్దెకు ఇచ్చే పద్ధతి ఉంది. ఈ ప్రాంతంలోని ధనికులు, వివాహాలు కాని వారు వేరేవారి భార్యలను అద్దెలకు తీసుకుంటూ ఉంటారు. ఇదంతా పక్కాగా, టైమ్ పీరియడ్‌తో జరుగుతూ ఉంటుంది. అంటే, వారం, నెల, ఆరు నెలలు, సంవత్సరం లెక్కను మహిళలను అద్దెకు తీసుకునే వ్యవహారం జరుగుతూ ఉంది. అంతేకాదు, అద్దెకు ఇచ్చే వారి మధ్య, తీసుకునే వారి మధ్య ఒప్పందం కూడా జరుగుతుందట. 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు బాండ్ పేపర్లలో ఈ విషయాన్ని రాసుకొని ఒక ఒప్పందం కుదుర్చుకుంటారట.
ధడిచా అనే పేరుతో ఈ తతంగం అంతా నడుస్తోంది. అద్దెకు వెళ్లే భార్యలు అద్దెకు తీసుకున్న వ్యక్తికి ఒప్పందం చేసుకున్న కాలానికి నిజమైన భార్య లాగానే మసులుకుంటారు. కాపురం చేయడం, ఇంటి వ్యవహారాలు చూసుకోవడం, వంట చేయడం వంటివి అన్నీ వీరు కూడా చేస్తారట. అంతేకాదు, ముందుగా ఒప్పందం చేసుకుంటే పిల్లలను కూడా కనిస్తారట. కేవలం పెళ్లి అయిన వారే కాదు పెళ్లి కాని యువతులను కూడా ఈ విధంగా అద్దెకు ఇస్తారట.
అయితే, ఒప్పందం, అద్దెకు ఇచ్చే మహిళ అందచందాలు వంటి వాటిపై ఆధారపడి ధర నిర్ణయిస్తారట. ఇప్పటికీ ఈ తతంగం కొనసాగుతోంది. కేవలం ఈ ప్రాంతంలోనే ఇలా జరుగుతోంది. అయితే, గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయట. ఇలాంటి అమానవీయ పద్ధతులు ఇంకా ఎలా కొనసాగుతున్నాయో మరి. వీటి నివారించేందుకు అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.