logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

తెలంగాణలో మందు బాబులకు శుభవార్త..!

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం ప్రియులు ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వీరికి శుభవార్త వినిపించింది. ఇకపై రాష్ట్రంలో సాయంత్రం 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో రాత్రి కర్ఫ్యూ కారణంగా 7 గంటలకు కర్ఫ్యూ మొదలైతే సాయంత్రం 6 గంటలకే మద్యం దుకాణాలు మూతపడేట్టుగా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

అయితే ఇటీవల కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటలగా మార్చింది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు కూడా సాయంత్రం 8 గంటల వరకు విక్రయాలు జరిపేందుకు అనుమతి లభించింది. మరోవైపు తెలాంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య హడలెత్తిస్తుంది. ఒక్క ఆదివారం రోజే రాష్ట్రంలో 199 కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698 కు చేరుకుంది. కరోనా మరణల సంఖ్యా 82కు చేరింది.

Related News