logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘జబర్దస్త్’ కమెడియన్.. ఆ కంటెస్టెంట్లకి గట్టి పోటీ..

భారీ అంచనాలతో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఒక్క శని, ఆది వారాల్లో వచ్చే నాగార్జున ఎపిసోడ్స్ తప్ప మిగిలిన వారాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో షోను మరింత రక్తి కట్టించడానికి హౌస్ లోకి మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయిని పంపించారు.

అయితే అతనికి హౌస్ మేట్స్ కి మధ్య ఇంటరాక్షన్ లేకపోవడంతో కుమార్ సాయి హౌస్ లో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడన్న లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఈరోజుల్లో’ వంటి సినిమాతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న కుమార్ సాయి హౌస్ లోకి వెళితే ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైమెంట్ లభిస్తుందని వేసిన అంచనాలు కూడా ఫలించనట్టుగా అనిపిస్తుంది. మంచి విషయం ఉన్న కమెడియన్ అయిన అతను ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మాత్రం ఈసారి ఎలిమినేషన్లో నుంచి సేఫ్ అయినట్టే.

ఇక ఇంతలోనే మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో కంటెస్టెంటు హౌస్ లోకి వెళ్తున్నట్టుగా బిగ్ బాస్ ప్రోమోను విడుదల చేసింది. అయితే ఈ సారి వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళబోయేసో జబర్దస్త్ ద్వారా ఫెమస్ అయిన ముక్కు అవినాష్ అని ఆల్రెడీ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అదే నిజమైతే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న వాళ్ళ కన్నా బుల్లితెర ప్రేక్షకుల్లో ముక్కు అవినాష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం హౌస్ లో టాప్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్న లాస్య, నోయెల్, అభిజిత్, హారిక, దివి సోహైల్ కు ఇతని ద్వారా గట్టి పోటీ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎంట్రీతోనైనా బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారుతుందా లేదా అనే విషయం వేచి చూడాలి.

Related News