logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

మూవీ రివ్యూ: నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ఎలా ఉందంటే ..?

విభిన్న కథలతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున ఈసారి యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్ గా నటించగా మరో నటి సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మగా ఈ సినిమాలో నాగార్జున కనిపించనున్నారు. మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేయడం, సినిమాలో నాగార్జున లుక్ వైరల్ అవ్వడంతో పాటుగా యాక్షన్ సన్నివేశాలు, ఫామిలీ డ్రామా లాంటి అంశాలు ఉండటంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు పెరిగాయి. మరి వైల్డ్ డాగ్ సినిమా నాగార్జునకు ఎలాంటి ఫలితాన్ని అందించిందో రివ్యూలో చూద్దాం..

కథ:

పూణే నగరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసును చేధించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తుంటారు. ఈ కేసును టేక్ అప్ చేసేందుకు అప్పటికే డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ అయిన సీనియర్ ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మను రంగంలోకి దించాలని అనుకుంటారు. చివరకు ఈ కేసును టేకప్ చేయడానికి అధికారులకు విజయ్ వర్మ కొన్ని కండిషన్లు పెట్టి ఒప్పుకుంటాడు. అయితే ఊహించనివిధంగా విజయ్ వర్మ పై మరోసారి సస్పెన్షన్ వేటు పడుతుంది. ఇంతకీ పూణే బాంబ్ బ్లాస్ట్ కేసులో విజయ్ వర్మ కనిపెట్టిన విషయాలు ఏమిటి? అతని సస్పెన్షన్ వెనకకు కారణాలు ఏమిటి? చివరకు విజయ్ తాను అనుకున్నది సాధించాడా ఈ కేసు వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలు తెలుసుకోవాలంటే వైల్డ్ డాగ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వైల్డ్ డాగ్ సినిమా మొత్తం సీరియస్ గా సాగుతుంది. ఎక్కడా రెగ్యులర్ సినిమాలలో కనిపించే కమర్షియల్ హంగులు కనిపించవు. ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీయడం కొంత కష్టమైనా పనే. అయితే ఈ విషయంలో దర్శకుడు సాల్మోన్ ఏ మేరకు సక్సెస్ అయ్యాడో తెలియాలంటే ప్రేక్షకుల రియాక్షన్ కోసం వేచి చూడాల్సిందే. సినిమాలో విజయ్ వర్మ కూతురు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడం, ప్రియా వర్మ(దియా మీర్జా) ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలే చాలా కీలకం. ఆ విషయంలో సినిమా టీమ్ చాలా దృష్టి పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కు ముందు వచ్చే ఫైట్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి హీరో ఉగ్రవాదిని పట్టుకోవడానికి పూణే వెళ్లడం, అక్కడ వైల్డ్ డాగ్ టీమ్ విన్యాసాలు ఇలా కొన్ని సీన్లు అంత కొత్తగా ఏమీ అనిపించవు. సెకండ్ హాఫ్ లో చివరి 20 నిమిషాలు మాత్రం చాలా థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఇదే సినిమాకు హైలెట్ గా మాదిరే అవకాశం ఉంది. విజయ్ వర్మ పాత్రలో నాగార్జున మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపాడు.

ఆటిట్యూడ్, ఎమోషన్, కోపం, దేశభక్తి ఇలా అన్ని రకాల ఎమోషన్లను చూపుతూ చెలరేగిపోయాడు. యాక్షన్ సీన్లలో నాగార్జున నటన అద్భుతంగా ఉంది. అక్కడక్కడా కొన్ని సాగదీత సీన్లు మినహాయిస్తే వైల్డ్ డాగ్ సినిమాను మంచి థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు. మిగిలిన నటీనటులైన దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ రెజా తదితరులు పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను హైలెట్ చేశాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయి మేరకు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో ప్లస్ పాయింట్స్ ను చూస్తే.. స్టోరీ లైన్, నాగార్జున నటన, యాక్షన్ సీన్స్, థమన్ మ్యూజిక్ వైల్డ్ డాగ్ కు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. ఆసక్తిగా సాగని కథనం, కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటికి చెప్పుకోవచ్చు.

రేటింగ్:

వైల్డ్ డాగ్ సినిమాకు ఫైనల్ గా 2. 5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News