logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

నిత్యానంద వీడియోలు చూసేవాడు.. భార్యకు వేధింపులు: ప్రదీప్ జోషీపై ఫిర్యాదు

ప్రదీప్ జోషి పేరుతో సోషల్ మీడియాలో స్వామీజీగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తిపై ఆయన మూడో భార్య సిసిఎస్ పోలీసులను ఆశ్రయించింది. అయన పైకి చెప్పేవన్నీ నీతులేనని.. నిజ జీవితంలో దుర్మార్గుడని పేర్కొంది. తనతో పాటుగా ఎంతో మంది యువతులకు మాయ మాటలు చెప్పి మోసం చేసేవాడని, అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె ఫిర్యాదు లో పేర్కొంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్ జోషి మణికొండలో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అతనికి 2019 మార్చి నెలలో డాక్టర్ శ్రేయ తో వివాహం జరిగింది. అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే మొదటి వివాహం, ఆమెతో సంతానం, విడాకుల విషయం మాత్రమే చెప్పిన ప్రదీప్ జోషి రెండో భార్య గురించి చెప్పకుండా తనను పెళ్లి చేసుకుని మోసం చేసాడని వాపోయింది.

స్వామిజి కావడంతో తనను గతేడాది వివాహం చేసుకున్నానని ఆనాటి నుంచి తనను మానసిక క్షోభకు గురి చేసి వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. పెళ్లి సమయంలో తన దగ్గర నుంచి రూ. 15 లక్షలు విలువైన వెండి, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. కాగా తాను పోలీసుల విచారణకు హాజరు కావాలని కోరితే కరోనా పేరుతో తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిపింది.

ప్రదీప్ జోషి తరచూ నిత్యానందకు సంబందించిన వీడియోలు చూసి తాను కూడా అలా కావాలనేవాడు. అతని లాగే ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పాటు చేయాలనీ కళలు కనేవాడని బాధితురాలు పేర్కొంది. హైదరాబాద్, బెంగుళూరులో శిబిరాల పేరుతో మహిళలను ట్రాప్ చేస్తాడని పేర్కొంది.

Related News