logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

ప్రేమ పెళ్లి.. పెను విషాదంగా ముగిసింది

తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని అంటారు. ఇది ఓ జంట విషయంలో నిజమైంది. వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం ఇంట్లో పెద్దవాళ్లకు చెబితే పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇంతలో విధి వారి పాలిట శాపమైంది. రెండు నెలల వ్యవధిలో భార్య భర్తలిద్దరూ మరణించడం విషాదంగా మారింది.

నెల్లూరు జిల్లా రావూరు మండలం మిట్టపల్లి మండలానికి కు చెందిన శిరీష నగరంలోని జీజీహెచ్ లో కాంట్రాక్ట్ నర్సుగా విధులు నిర్వహిస్తుంది. గూడూరు అయ్యవారి పాళేనికి చెందిన జగదీశ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇటీవల ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.

డిసెంబర్ లో జగదీశ్ గుండెపోటుతో మరణించాడు. ఆనాటి నుంచి శిరీష తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి అర్థాంతరంగా వదిలివెళ్లిపోవడం, అటు కుటుంబ సభ్యుల ఆదరణ కూడా లేకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇటీవల తన స్నేహితురాలు రమాదేవికి తన ఇంటికి పిలిపించుకుని ఉంటుంది. ఈ నెల 7వ తేదీన శిరీష కళ్ళు తిరుగుతున్నాయని స్నేహితురాలికి చెప్పింది.

వెంటనే జీజీహెచ్ కు తరలించగా అప్పటికే శిరీష మరణించినట్టుగా నిర్దారించారు. శిరీష చేతిపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

Related News