logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ఆటంకాలు తప్పవా? కారణం ఇదే!

తెలుగు వారికి సంక్రాంతి అంటే అతి పెద్ద పండుగలలో ఒకటి. భోగి, సంక్రాతి, కనుమ అంటూ ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ పండుగను పశు పక్ష్యాదులు, వ్యవసాయ క్షేత్రాల్లో పంట పండించడానికి సాయాంపడిన పాడి జంతువులను పూజించుకోవడానికి జరుపుతుంటారు. అయితే కనుమ నాడు ఇంట్లో మరణించిన వారికి నైవేద్యం వండి దానిని ప్రసాదంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే.

కానీ కనుమ నాడు కాకి కూడా కదలదని అంటారు. అంటే ఆ రోజు ప్రయాణాలు చేయకూడదని చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు చెబుతారు. అయితే ఈ ఆచారం వెనకాల ఓ మంచి ఉద్దేశ్యం దాగి ఉంది. సంక్రాతి అంటే పాడి పంటల పండగ అని తెలిసిందే. ఈ పండుగ నాడు బంధువులంతా ఒక్క చోట చేరి సరదాగా గడుపుతారు. అలాగే ఏడాదంతా రైతులతో పాటుగా పంటలు పండించడానికి కష్టపడే పాడి జంతువులకు కనుమ నాడు ప్రత్యేక పూజలు చేస్తారు.

పూర్వం ప్రయాణాలకు ఆవులను , ఎద్దులనే ఎడ్ల బండి కట్టి ఉపయోగించేవారు. అయితే కనీసం కనుమ ఒక్క రోజైనా వాటికి విశ్రాంతి ఇవ్వాలని ప్రయాణాలు చేస్తే ఆరోజు వాటిని కష్టపెట్టిన వారమవుతామని చెప్పి ఈరోజు ప్రయాణాలు చేయరాదని పెద్దలు చెప్తారు. కనుమను పాడి పశువులకు రైతులు ఇచ్చే గౌరవంగా భావిస్తారు. అందుకే పెద్దలు ఈ విధంగా చెప్పి ప్రయాణాలకు దూరంగా ఉంచేవారు.

Related News