logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సాయి పల్లవి అంటే టాలీవుడ్ కు ఎందుకంత భయం..?

సాయి పల్లవి … శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. ముఖ్యంగా యువత లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసారు. దక్షణాది సినిమాల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ కు ఈపాటికే ఆమె స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోవాలి. కానీ టాలీవుడ్ లో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సాయి పల్లవి తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కుర్ర హీరోలు భయపడుతున్నారని అందుకే ఆమె ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది అని అంటున్నారు.

అందుకు సాయి పల్లవి సహజమైన నటనే కారణమట. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి పూర్తి న్యాయం చేయగల సత్తా ఆమెది. తెలుగులో మంచి నటులుగా పేరున్న నాని, శర్వానంద్ లాంటి వాళ్ళు తప్ప సాయి పల్లవిని తట్టుకోవడం యంగ్ హీరోల వల్ల కాదంటున్నారు. అందుకే ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి అని టాక్. ఫిదా సినిమాలో కూడా వరుణ్ తేజ్ ను పూర్తిగా డామినేట్ చేసింది సాయి పల్లవి. ఆ సినిమా హిట్టైనా కూడా వరుణ్ తేజ్ కు పేరు రాలేదంటే సీన్ అర్థం చేసుకోవచ్చు. ఆమధ్య శర్వానంద్ ‘జాను’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సాయి పల్లవి డామినేషన్ అంటే భయం అంటూ ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా సాయి పల్లవి శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమా కోసం నాగ చైతన్యతో జత కట్టింది. ఈ సినిమాలో ‘హే పిల్లా’ అంటూ సాగే ఓ పాట ట్రేండింగ్ లో ఉంది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అవుతుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం సాయి పల్లవి ముందు చైతు తేలిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డాన్సుల విషయంలో సాయి పల్లవి దుమ్ములేపుతుందని చైతు మాత్రం మినిమమ్ 10 టేకులు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఒకెత్తయితే సాయి పల్లవికి ఇప్పుడు హీరోయిన్లు కూడా భయపడుతున్నారట. తాజాగా సాయి పల్లవి నాని పీరియాడికల్ ఫిలిం ‘శ్యామ్ సింగరాయ’ సినిమాకు ఒకే చెప్పి గతంలో వీరిద్దరి మధ్య వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది.

అయితే ఇక్కడే కొత్త సమస్య ఎదురైంది. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించవలసి ఉండగా అందులో ఒక పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా నటించవలసి ఉంది. కానీ తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్టు తెలుస్తుంది. సాయి పల్లవి ఎంట్రీ తోనే ఆమె వెనక్కి తగ్గిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరో హీరోయిన్ పాత్రకు కూడా దక్షణాది హీరోయిన్లు ఆసక్తి చూపడం లేదట. ఎందుకంటే సాయి పల్లవితో నటిస్తే తన సహజ నటనతో తానే హైలైట్ అవుతుందని, కొంచం కూడా గ్లామర్ ఒలికించకుండా మిలియన్లలో అభిమానులను బుట్టలో వేసుకుంటుందని భయపడిపోతున్నారట.

Related News