logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

శానిటైజ‌ర్ తాగినా, మ‌న శ‌రీరంలోకి వెళ్లినా ఏమ‌వుతుందో తెలుసా..?

కరోనా వైరస్ కారణంగా శానిటైజర్ వాడకం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. కరోనాకు ఇప్పటికీ నిర్దిష్టమైన చికిత్స, వాక్సిన్ అందుబాటులో లేకపోవడం, వైరస్ నుంచి కాపాడుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటే మార్గం కావడం వల్ల ప్రభుత్వాలు కూడా ప్రజలను శానిటైజర్ వినియోగించాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగిపోయింది.

అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యానికి బానిసలైన వారు శానిటైజర్లలో ఆల్కహాల్ ఉంటుందని భావించి వీటిని తాగే ప్ర్రాయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శానిటైజర్లలో వాడేది కూడా మద్యం తయారీలో వినియోగించే ఆల్కహాల్ నే. అయినా శానిటైజర్ తాగిన వారు ఎలా మరణిస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలి.

మనం వినియోగిస్తున్న శానిటైజర్లలో 60 శాతానికి తగ్గకుండా ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. అదే మన రాష్ట్రంలో తయారు చేసే శానిటైజర్లలో 80 శాతం ఉంటుంది. మద్యం తయారీలో కూడా ఈ ఇథైల్ ఆల్కహాల్ నే వినియోగిస్తారు. భారత్ లో ప్రస్తుతం మద్యం తయారు చేసే సంస్థలు, చెరుకు పరిశ్రమల నుంచి ఈ ఇథైల్ ను సేకరించి శానిటైజర్ల తయారీలో వినియోయిస్తున్నారు.

కానీ మద్యానికి బదులుగా శానిటైజర్లు తాగితే కచ్చితంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. శానిటైజర్లలో ఆల్కహాల్ తో పాటుగా మరికొన్ని హానికర రసాయనాలు కూడా ఉంటాయి. శానిటైజర్ వాడినప్పుడు చేతులకు అంటుకున్న ప్రాణాంతక బాక్టీరియా, ఫంగస్ లను చంపేందుకు 7 నుంచి 8 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ను కలుపుతారు. శానిటైజర్ ఎక్కువ సేపు చేతికి అంటుకోకుండా వెంటనే ఆరిపోయేలా చేసేందుకు 5 శాతం గ్లిజరిన్ ను వినియోగిస్తారు.

ఎట్టి పరిస్థితుల్లో శానిటైజర్లను శరీరం బయట తప్ప లోపలికి తీసుకోకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ శానిటైజర్ల రంగు, ఆల్కహాల్ వాసన మందుబాబులను ఆకర్షిస్తుంది. దీంతో మద్యానికి బానిసైన వారు దీనిని తాగుతున్నారు. శానిటైజర్ ను తాగినప్పుడు అది క్రమక్రమంగా గుండె, కాలేయం పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శానిటైజర్ల వల్ల మరణిస్తున్న వారిలో కార్డియోమయోపతి అనే సమస్య ఏర్పడుతుంది.

అంటే గుండె కండరాలను ఇది దెబ్బతీస్తుంది. దీంతో శరీర భాగాలకు రక్త ప్రసరణ కష్టమయ్యి గుండె వైఫల్యం చెంది ప్రాణాలు కోల్పోతారు. ఎవరైనా కాళీ కడుపుతో శానిటైజర్ తాగితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అత్యంత వేగంగా రక్తంలో కలిసి మెదడును దెబ్బతీస్తుంది. అందువల్ల మూర్ఛ రావడం, బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శానిటైజర్ నుంచి ఆల్కహాల్ వేరు చేయడం అనేది సాధ్యం కాదు. అదే విధంగా శానిటైజర్లలో నీళ్లు కలుపుకుని తాగితే ప్రమాదం ఉండదని భావించడం కేవలం అపోహ మాత్రమే.

Related News