logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మ‌హాత్మా గాంధీకి నోబెల్ పుర‌స్కారం ఎందుకు రాలేదో తెలుసా ?

జాతిపిత మ‌హాత్మా గాంధీ భార‌తీయుల‌కే కాదు ప్ర‌పంచం మొత్తానికి ఆద‌ర్శ‌ప్రాయుడు. స‌త్యం, అహింస అని ఆయ‌న చూపిన మార్గం ప్ర‌పంచ‌చ‌రిత్ర‌లో అనేక పోరాటాల‌కు స్ఫూర్తి. నోబెల్ అందుకున్న‌ నెల్స‌న్ మండేలా వంటి మ‌హ‌నీయుడు న‌ల్ల జాతీయుల కోసం చేసిన పోరాటానికి స్ఫూర్తి మ‌న మహాత్మా గాంధీనే. అమెరికాలో న‌ల్ల జాతీయుల హ‌క్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథ‌ర్ కింగ్‌ జూనియ‌ర్ అయితే మ‌హాత్మా గాంధీని ఆద‌ర్శంగా తీసుకున్నారు. మ‌హాత్ముడికి నివాళి అర్పించేందుకు, ఆయ‌న పోరాటాన్ని మ‌రింత తెలుసుకునేందుకు మార్టిన్ లూథ‌ర్ కింగ్ భార‌త్ కూడా సంద‌ర్శించారు.

ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అనేక శాంతియుత ఉద్య‌మాలు గాంధేయ విధానంలోనే జ‌రుగుతున్నాయి. శాంతి కోసం ఇంత‌లా ప‌రిత‌పించిన మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పుర‌స్కారం ల‌భించ‌క‌పోవ‌డం మాత్రం ఒక వెల‌తి. శాంతి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి పుర‌స్కారానికి మ‌హాత్మా గాంధీని మించిన అర్హులు లేర‌నేది అంద‌రూ ఒప్పుకునేదే. గాంధీ సిద్ధాంతాల‌ను ఆచ‌రించిన వారికి నోబెల్ పుర‌స్కారం అందింది కానీ మ‌హాత్మా గాంధీకి మాత్రం ద‌క్క‌లేదు.

ఇప్ప‌టివ‌ర‌కు వంద సార్లు నోబెల్ పుర‌స్కారాలు ప్ర‌క‌టించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 10న నోబెల్ ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. మ‌హాత్మ గాంధీకి నోబెల్ ఇవ్వాల‌నే ఆలోచ‌న ఆయ‌న జీవించి ఉన్న కాలంలోనే నోబెల్ క‌మిటీకి వ‌చ్చింది. 1937, 1939, 1947, 1948లో నాలుగుసార్లు నోబెల్ శాంతి పుర‌స్కారానికి గాంధీ పేరును ప్ర‌తిపాదించారు. కానీ, ప్ర‌తీసారి ఏదో ఓ కార‌ణంతో గాంధీకి నోబెల్ అవార్డు ఇచ్చేందుకు నిరాక‌రించారు.

మ‌హాత్మా గాంధీ కేవ‌లం భార‌తీయుల కోసం మాత్ర‌మే పోరాడార‌నే కార‌ణంతో ఒక‌సారి, ఆయ‌న త‌న విధానాల‌ను మార్చుకుంటార‌నే కార‌ణంతో మ‌రోసారి, కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌నే కార‌ణంతో ఇంకోసారి నోబెల్ శాంతి పుర‌స్కారం గాంధీకి ఇవ్వ‌లేద‌ని చెబుతారు. అయితే, నాలుగోసారి ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్పుడు 1948లో మాత్రం గాంధీకి క‌చ్చితంగా నోబెల్ శాంతి పుర‌స్కారం వ‌చ్చి ఉండేది.

అప్పుడు గాంధీతో స‌హా కేవ‌లం ఆరుగురి పేర్లు మాత్ర‌మే ఈ అవార్డుకు నామినేట్ అయ్యాయి. కానీ, గాంధీ పేరు ప్ర‌తిపాద‌న‌కు వ‌చ్చిన త‌ర్వాత నాలుగు రోజుల‌కే ఆయ‌న హ‌త్య జ‌రిగింది. అప్ప‌ట్లో మ‌ర‌ణించిన వారికి నోబెల్ అవార్డును ఇచ్చేవారు కాదు. దీంతో అప్పుడు కూడా గాంధీకి నోబెల్ పుర‌స్కారం అంద‌కుండా పోయింది. 1948లో నోబెల్ క‌మిటీ ఎవరికి శాంతి పుర‌స్కారం అందించ‌లేదు. నామినేట్ అయిన వారిలో జీవించి ఉన్న ఎవ‌రూ నోబెల్ శాంతి పుర‌స్కారానికి త‌గిన వారు కాద‌ని క‌మిటీ చెప్పింది. ఇన్‌డైరెక్ట్‌గా మ‌హాత్మ గాంధీ జీవించి ఉంటే ఆయ‌న‌కే నోబెల్ శాంతి పుర‌స్కారం ద‌క్కేద‌నేది క‌మిటీ చెప్పిన ఈ మాట‌తో తెలిసింది.

ఆ త‌ర్వాతికాలంలో మ‌ళ్లీ ఎప్పుడూ గాంధీ పేరు ఈ అవార్డుకు నామినేట్ కాలేదు. కానీ, నోబెల్ శాంతి పుర‌స్కారాలు అందుకున్న నెల్స‌న్ మండేలా, మార్టిన్ లూథెర్ కింగ్‌, ద‌లైలామా వంటి వారు త‌మ‌కు గాంధీనే స్ఫూర్తి అని ప్ర‌క‌టించారు. అంటే గాంధీకి నోబెల్ పుర‌స్కారం అందుకోవ‌డం కంటే గొప్ప గౌర‌వం ల‌భించింద‌నే చెప్పాలి.

Related News