logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

కోల్‌కతాలో మాత్రమే పోలీస్ యూనిఫార్మ్ తెలుపు రంగులో ఎందుకు ఉంటుంది?

పోలీసులను ఖాకిలు అని కూడా అంటారు. వారు ధరించే యూనిఫార్మ్ ఆ రంగులో ఉండటమే అందుకు కారణం. అయితే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసులు ఖాకీ రంగు యూనిఫార్మ్ ను ధరిస్తారు. ఒక్క కలకత్తా రాష్ట్రంలో మాత్రమే పోలీసులు తెల్ల రంగు యూనిఫార్మ్ లో దర్శనమిస్తారు. అక్కడి పోలీసులకు మాత్రమే ఎందుకీ ప్రత్యేకమైన నిబంధన అనే సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది.

మనదేశంలో బ్రిటీషు వారు మొదట అడుగుపెట్టింది వెస్ట్ బెంగాల్ లోనే. అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి భారత దేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకుని పాలించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే 1845 లో బ్రిటిషు వారు పోలీసు శాఖను ఏర్పాటు చేసారు. వారు తెలుపు రంగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే పోలీసు బలగాలు కూడా తెల్లటి దుస్తులు ధరించాలని ఈ రంగును ప్రతిపాదించారు. అయితే పోలీసులు సుదీర్ఘమైన డ్యూటీల కారణంగా వారి యూనిఫార్మ్ చాలా మురికిగా తయారయ్యేది.

అయితే ఈ మరకలు కనిపించకుండా ఉండటానికి చాలా రకాలుగా ప్రయత్నించేవారు. కొంత మంది తమ యూనిఫార్మ్ కు నీలి రంగు వేసుకునేవారు. మరికొందరు మరకలు అంటిన ప్రాంతంలో తెల్ల రంగు వేసుకుని డ్యూటీలకు హాజరయ్యేవారు. ఈ సమస్యను గుర్తించిన ఉన్నతాధికారులు మట్టి రంగులే ఉండే యూనిఫార్మ్ ధరిస్తే దుస్తులు మురికిగా అయినా అంతగా బయటకు కనిపించదని భావించారు. దీంతో రెండేళ్ల తర్వాత పోలీసులందరికీ ఖాకీ రంగు యూనిఫార్మ్ ను ధరించాలని ఆదేశించారు. అందుకోసం టీ ఆకులు, ఫ్యాబ్రిక్ రంగులను ఉపయోగించి తెలుపుగా ఉన్నపోలీసు దుస్తులను ఖాకీ రంగులోకి మార్చుకునేవారు. ఆ తర్వాత పోలీసులకు ఖాకి రంగు యూనిఫార్మ్ ను అధికారికంగా మార్చారు.

1861లో బెంగాల్‌లో రాష్ట్ర పోలీస్‌ శాఖ ఏర్పాటైన తర్వాత కూడా ఇదే కొనసాగింది. ఈ సారి ఈ నిబంధనను అన్ని రాష్ట్రాల పోలీసులకు వర్తింపజేశారు. కానీ కలకత్తాలోని పోలీసులు మాత్రం యూనిఫార్మ్ మార్పుకు ఒప్పుకోలేదు. అందుకుప్రధాన కారణం అక్కడి వాతావరణ పరిస్థితులే. సముద్రతీరానికి అతి దగ్గరగా ఉండే కలకత్తా లో ఉష్ణోగ్రతలు అధికంగా అంటాయి. ఆ వేడిని తట్టుకుంటూ అక్కడి పోలీసులు డ్యూటీ చేయవలసి ఉంటుంది. తెలుపు అతి వేడిని గ్రహించదు కాబట్టి ఈ రంగు దుస్తులైతేనే ఆ వేడిని తట్టుకుని డ్యూటీ చేయగలమని తెగేసి చెప్పారు.

నిజానికి పశ్చిమ బెంగాల్ లో రెండు పోలీసు వ్యవస్థలు ఉంటాయి. ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసు శాఖ అయితే మరొకటి కోల్ కత్తా మెట్రోపాలిటన్ పోలీసు వ్యవస్థ. కాలక్రమంలో ఆ రాష్ట్ర పోలీసులు ఖాకీ రంగులోకి మారినా కోల్ కతా – హౌరా జంటనగరాల పోలీసులు మాత్రం ఇప్పటికీ తెలుపు రంగు యూనిఫారంనే ధరిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పోలీసులు ఎవరు కోల్ కతా పోలీసులు ఎవరనే విషయాన్ని గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది.

 

Related News
%d bloggers like this: