logo

  BREAKING NEWS

కరెన్సీ నోటుపై వినాయకుడి చిత్రాన్ని ముద్రించే ఏకైక ముస్లిం దేశం.. ఎందుకంటే?

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముస్లిం మతస్తులు అధికంగా ఉండే ఇండోనేసియా దేశం అక్కడి అధికారిక కరెన్సీ నోటుపై హిందూ దేవుడైన వినాయకుడి బొమ్మను ముద్రిస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే అయినా ఇటీవల బాలీవుడ్ దర్శకుడు తనూజ్ గార్గ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాకే ఈ వార్త బాగా వినిపించడం మొదలైంది. ఈరోజు వినాయక చవితి పర్వదినం కావున మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండోనేషియాలో దాదాపు 87.3 శాతం ముస్లిం మతస్తులు ఉంటె కేవలం 1. 7 శాతం మాత్రమే హిందువులు ఉంటారు.

కానీ ఇండోనేషియా- భారత్ దేశాలు సంస్కృతి సంప్రదాయాలలో ఒకే విధమైన పద్దతిని అవలంభిస్తాయని అంటారు. ఆ దేశంలో హిందువుల ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది. ఇక హిందూ దేవుళ్ళ విగ్రహాలు, రామాయణ, మహాభారత గాథలు కూడా ఆ దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ భారీగా ఆటుపోట్లకు లోనైంది. ఈ కారణంగా అక్కడి ప్రజలు విపరీతమైన పేదరికాన్ని చూడవలసి వచ్చింది.

దీంతో ఆ దేశ ఆర్థిక వేత్తలంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆది దేవుడైన వినాయకుడి బొమ్మను కరెన్సీపై ముద్రించాలని భావించాయి. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఇండోనేషియా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని అక్కడి స్థానికులు చెప్తారు. ఆనాటి నుంచి 20 వేల నోటుపై ఆ దేశ స్వాతంత్ర్య సమరయోధుడు హజారే దేవాంతర పక్కన వినాయకుడి బొమ్మను ముద్రించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చాలా ఏళ్ళ వరకు ఇది కొనసాగుతూ వచ్చింది.

Related News