logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

కరోనాపై షాకింగ్ విషయం బయటపెట్టిన డబ్ల్యూహెచ్వో.. యువతకు హెచ్చరిక!

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకసారి కరోనా నెగిటివ్ వచ్చిన వ్యక్తుల్లో కూడా వారి ఆరోగ్యం పై ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని తెలిపింది. అప్పుడు వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుననేది ఇప్పుడే చెప్పలేము కానీ మళ్ళీ మామూలు స్థితికి రావడం అంత తేలిక కాదని అంటుంది.

ఎందుకంటే కరోనా వైరస్ ఒక సారి శరీరంలోకి వచ్చిన తర్వాత అది ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతున్నటుగా గుర్తించామన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంశం పై స్పష్టత ఇవ్వలేమని పేర్కొంది. కానీ ఈ వైరస్ వ్యక్తి ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని అందువల్ల ప్రతి ఒక్కరు ఈ వైరస్ భారిన పడకుండా ముందే జాగ్రత్త వహించాలని తెలిపింది.

ముఖ్యంగా కరోనా వైరస్ పై పోరాటంలో యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేసింది. అంతేకాదు ఇప్పటివరకు కరోనా వైరస్ వృద్దులు, చిన్న పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పైనే తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

యువకుల్లో కరోనా ముప్పు గురించిన విషయాన్ని డబ్ల్యూహెచ్వో ఇది వరకే స్పష్టం చేసింది. కానీ తాజాగా కొన్ని దేశాల్లో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. కరోనా వైరస్ ఏ విధంగా అయితే వృద్దులలో ప్రభావం చూపుతుందో అదే విధంగా యువతపై కూడా ప్రభావం ఉంటుందన్నారు. యువతలో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్న విషయం కూడా గుర్తు చేసింది.

కరోనా వైరస్ కొన్ని దేశాల్లో రెండో దశలో విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కరోనా వైరస్ లక్షణాలు లేకుండా కూడా వ్యాపిస్తున్నందువల్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తే యువతకు కూడా ప్రాణాపాయం తప్పదని తెలిపింది. ప్రస్తుతానికి యువతలో వైరస్ సోకితే అధిక శాతం కోలుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు అత్యవసర చికిత్స కూడా అవసరం అవుతుందని, ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదని పేర్కొంది.

Related News