logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనాపై మరోసారి హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 70 లక్షలు దాటడం వైరస్ తీవ్రతను తెలియజేస్తుందని సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరికలు జారీ చేసారు. ఐరోపా లో ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన గడిచిన పది రోజులలో 9 రోజుల్లో అత్యధికంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు.

అమెరికా, దక్షిణ ఆసియాలోని దేశాల నుంచే 75 శాతం పాజిటివ్ వస్తున్నట్టుగా తెలిపారు. కరోనా విస్తృతంగా ఉన్న దేశాల్లో నిర్లక్ష్యమే అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని అయన తెలిపారు. ఇది రానున్న రోజుల్లో కరోనా ప్రభావం మరింత అదనంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో జాతి వివక్షకు నిరసనగా తలెత్తుతున్న నిరసనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

నిరసనల్లో పాల్గొనేవారు భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కేసుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగానే ఉన్నప్పటికీ రోజు రోజుకి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని, కానీ కొన్ని దేశాల్లో ప్రభావం తక్కువగా ఉండటం కొంత మేర ఊరట కలిగిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంతా కరోనాతో ఇప్పటి వరకు 71,93,476 మంది ఈ వ్యాధి బారన పడగా.. వారిలో 4,08,614 మంది చనిపోయారు.
`

Related News