logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రపంచదేశాలకు షాక్ ఇచ్చిన ప్రపంచఆరోగ్య సంస్థ

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలను నిత్యం అప్రమత్తం చేస్తూ సూచనలు చేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెలువడిన తాజా ప్రకటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. చైనా నుంచి కరోనా ఇతర దేశాలకు వ్యాపించడం మొదలైన నాటి నుంచి కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా కరోనా పై తాజా సమాచారాన్ని ఇతర దేశాలకు చేరవేసేది ఈ సంస్థ.

అయితే ఇప్పుడు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళవలసి వచ్చినట్టుగా తెలిపారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వలన తాను కూడా సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యానని అయన తెలిపారు. తనకిప్పుడు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. అయితే కరోనా నిబంధనలమేరకు తాను క్వారెంటైన్ లో ఉంటున్నానని అక్కడి నుంచే పని చేస్తున్నానని తెలిపారు.

ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందరికి జాగ్రత్తలు చెప్పే వారే కరోనా నుంచి తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. అంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనాను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Related News