logo

  BREAKING NEWS

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |  

క‌రోనా ఎప్పుడు పోతుంది ? క‌రోనాతో యువ‌త‌కు ముప్పు లేదా ?

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మ‌రో ఏడాది వ‌ర‌కు ఉంటుంద‌ని కొంద‌రు, వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందే అని మ‌రికొంద‌రు అంటున్నారు. నిపుణులు సైతం మ‌రో ఏడాది, రెండేళ్ల పాటు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. భార‌త్‌లోకి వైర‌స్ ప్ర‌వేశించి ఇప్ప‌టికి ఆరు నెల‌లే అవుతుంది. ఈ ఆరు నెల‌ల్లోనే మ‌నం అత‌లాకుత‌లం అవుతున్నాం. మ‌న‌మే కాదు ప్ర‌పంచ‌మంతా క‌రోనాతో సంక్షోభంలో చిక్కుకుపోయింది.

ఇటువంటి స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ భ‌‌య‌పెట్టించే విష‌యాన్ని ఒక‌టి చెప్పింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఒక‌టి, రెండేళ్లు కాదు… ఏకంగా ప‌దేళ్ల పాటు లేదా అంత‌క‌న్నా ఎక్కువే మాన‌వాళిపై ఉంటుంద‌ని డ‌బ్లూహెచ్ఓ ఎమ‌ర్జెన్సీ టీమ్ ప్ర‌క‌టించింది. తాజాగా ఈ బృందం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం అయ్యింది. వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌ట్లో త‌గ్గేది కాద‌నే విష‌యాన్ని ఈ బృందం చెప్పింది. అంతేకాదు, క‌రోనా వైర‌స్ ఒక‌సారి వ్యాప్తి చెంది, త‌గ్గిపోయిన ప్ర‌దేశాలు కూడా హాయిగా ఉండ‌వ‌చ్చు అనుకోవ‌డానికి లేద‌ని కూడా డ‌బ్లూహెచ్ఓ ఎమ‌ర్జెన్సీ టీమ్ చెబుతోంది.

వైర‌స్ వ్యాపించి ఇప్పుడు త‌గ్గిపోయిన ప్రాంతాల్లోనూ మ‌రోసారి విజృంభించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని తెలిపింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంకా చాలా మందికి క‌రోనా వైర‌స్ ముప్పు పొంచి ఉంద‌ని డ‌బ్లూహ‌చ్ఓ చెబుతోంది. క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన అనేక శాస్త్రీయ ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టివ‌రకు స‌మాధానాలు దొరికాయ‌ని, ఇంకా చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రావాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతోంది. క‌రోనా ఉంద‌ని జీవితాల‌ను వ‌దిలియ‌లేం కాబ‌ట్టి క‌రోనాతో క‌లిసి బ‌త‌కడం నేర్చుకోవాల‌ని డ‌బ్లూహెచ్ఓ సూచిస్తోంది. క‌రోనా వైర‌స్ నుంచి వృద్ధుల‌ను కాపాడుకుంటూ జీవితాల‌ను ముందుకు తీసుకెళ్లాల‌ని అంటోంది.

క‌రోనా వైర‌స్‌తో యువ‌త‌కు కూడా ముప్పు ఎక్కువ‌గానే ఉంద‌ని సైతం డ‌బ్లూహ‌చ్ఓ చెబుతోంది. క‌రోనాతో త‌మ‌కేమీ కాద‌నే నిర్ల‌క్ష్యంతో కొన్ని దేశాల్లో యువ‌త ఉంద‌ని, అందుకే ఆయా దేశాల్లో కేసులు ఎక్కువ‌గా పెరుగుతున్నాయ‌ని అంచ‌నా వేసింది. యువ‌త క‌రోనాకు అతీతం కాద‌ని, వారికీ క‌రోనా సోకుతుంద‌ని, వారినీ క‌రోనా చంపేసే ప్ర‌మాదం అంద‌ని డ‌బ్లూహెచ్ఓ అంటోంది. పైగా యువ‌త వ‌ల్ల క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా వ్యాపిస్తుంద‌ని, వారు ఇత‌రుల‌కు ఈ వైర‌స్‌ను ఎక్కువ‌గా అంటిస్తార‌ని చెబుతోంది. యువ‌త త‌మ‌కు తాము ర‌క్షించుకోవ‌డంతో పాటు ఇత‌రుల‌ను సంర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, క‌రోనా పోరాటంలో యువ‌త‌నే లీడ‌ర్లు కావ‌ల‌ని డ‌బ్లూహెచ్ఓ కోరుతోంది.

Related News