logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

జూనియర్ ఎన్టీఆర్ పక్కన సీతగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

బాలబాలికలతో దర్శకుడు గుణశేఖర్ ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతాదేవిగా స్మితా మాధవ్ నటించారు. ఆ ఏడాది ఉత్తమ బాలల చిత్రంగా ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమా తాజాగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాల రామాయణంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటి స్మితా మాధవ్.

సీతగా ఆమె పలికించిన హావ భావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దైవత్వం ఉట్టిపడే పాత్రలో చక్కగా నటించి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారామె. అయితే ఈ సినిమా తర్వాత మూడేళ్లకే జూనియర్ ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ స్మితా మాధవ్ మాత్రం ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి శబ్దాలయా బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గుణశేఖర్ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసాడు. అయితే సినిమాలో సీతాదేవి పాత్ర కోసం అంతా జల్లెడ పడుతున్నారు. అప్పటికే స్మిత మాధవ్ హైదరాబాద్ లోని నాజర్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నారు. నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఓ రోజు ఆమె ప్రదర్శనకు సంబందించిన ఫోటోలు పేపర్లో రావడంతో దర్శక నిర్మాతలు ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్లారు. అయితే సినిమాలో నటించడం అనగానే ఆమె తాత గారు మొదట ఒప్పుకోలేదు కానీ రాముడి సినిమా అని అందులో సీత పాత్ర అని వారిని ఒప్పించారు.

అలా రెండేళ్ల పాటు ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత స్మితా మాధవ్ కు పెద్ద దర్శకుల నుంచి సినిమా అవకాశాలు వచ్చినా ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం ఇష్టంలేక ఒప్పుకోలేదు. ఆ తర్వాత భరతనాట్యం, సంగీతంలో పీజీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. చెన్నై కి చెందిన కేశవ్ ను పెళ్లి చేసుకుని సెటిలయ్యారు.

Related News