logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కేసీఆర్ ప‌దేప‌దే చెప్పే జ‌ర్నలిస్టు రాహుల్ ఎవ‌రో తెలుసా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ క్రేజ్‌. కొత్త సినిమా టీవీలో మొద‌టిసారి ప్ర‌సారం అయ్యేట‌ప్పుడు, మ‌హిళ‌లంతా ఇష్టంగా చూసే టీవీ సీరియ‌ల్‌కు వ‌చ్చే రేంజ్‌కు మించి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ల వ్యూయ‌ర్‌షిప్ ఉంటుంది. తెలంగాణ‌లోనే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ కేసీఆర్ ప్రెస్ మీట్‌ల‌ను ఆస‌క్తిగా చూస్తుంటారు. స‌హ‌జంగా ఆరు నెల‌ల‌కు కూడా ఒక‌సారి కూడా ప్రెస్ మీట్ పెట్ట‌ని కేసీఆర్ క‌రోనా వైర‌స్ మొద‌లైన నాటి నుంచి త‌ర‌చూ మీడియా ముందుకు వ‌స్తున్నారు.

ప్రెస్ మీట్‌ల‌లో ఆయ‌న పంచులు, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే విధానం, ఆయ‌న వేసే జోకులు, చెప్పే సామెత‌లు అన్నీ సామాన్య జ‌నానికి బాగా క‌నెక్ట్ అవుతాయి. దీంతో కేసీఆర్ ప్ర‌తి మాట‌ను ఆస‌క్తిగా వింటుంటారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల త‌న ప్రెస్ మీట్‌ల‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, జ‌ర్నలిస్టు రాహుల్‌కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. రిపోర్ట‌ర్ రాహుల్ ప్ర‌శ్న అడ‌గ‌టం, కేసీఆర్ ఆయ‌న ప్ర‌శ్న‌ను ద‌బాయింపు ధోర‌ణితో తిప్పికొట్ట‌డం, ఒక్కోసారి సావ‌ధానంగా వివ‌ర‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతోంది.

ముఖ్య‌మంత్రి నోట ప‌దేప‌దే రాహుల్ అనే పేరు వ‌స్తుండ‌టంతో అస‌లు ఎవ‌రు ఈ జ‌ర్నలిస్టు రాహుల్ అనే ప్ర‌శ్న ప్ర‌జ‌ల్లోనూ మొద‌లైంది. ఎంత‌గా అంటే.. ఇంట‌ర్నెట్‌లో కూడా జ‌ర్నలిస్టు రాహుల్ ఎవ‌రు అని వెతుకుతున్నారు. రాహుల్ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ది హిందూలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు. ముఖ్య‌మంత్రి బీట్ ఆయ‌నే క‌వ‌ర్ చేస్తారు. దీంతో కేసీఆర్ ప్రెస్ మీట్‌ల‌కు ఆయ‌న హాజ‌ర‌వ‌డం, కేసీఆర్‌ను ప్ర‌శ్న‌లు అడగ‌‌టం, ఆయ‌న రాహుల్ అని పేరు పెట్టి మ‌రీ ఆ ప్ర‌శ్న‌ల‌కు ఒక్కోసారి ఒక్కో ర‌కంగా స్పందించ‌డం జ‌రుగుతోంది.

Related News