logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కరోనాపై మరో షాకిచ్చిన డబ్ల్యూహెచ్వో..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల జనాభా ఈ మహమ్మారి భారిన పడ్డారు. భారత్ లో 13 లక్షలు దాటింది. కరోనాతో మరో ఏడాది కాలం పోరాటం చేయక తప్పదంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తాజాగా డ‌బ్ల్యూహెచ్‌వో సోషల్ మీడియా ద్వారా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆ సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్ట‌ర్ సౌమ్య స్వామినాథన్.. ప్రపంచం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అంత తేలికైన విషయం కాదని తేల్చారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు 50 నుంచి 60 శాతం వరకు యాంటీ బాడీలు పెంచుకోవాలసి ఉంటుందన్నారు. అందుకు అవసరమైన స్థాయిలో ప్రజలు ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ని సాధించలేదన్నారు. సహజంగా వైరస్ సంక్రమణ జరిగి హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే ఈ క్రమంలో అనేక సార్లు వైరస్ ను ఎదుర్కోవలసి ఉంటుందని అప్పుడు మరణాల సంఖ్య కూడా భారీగా ఉండవచ్చన్నారు. అది ప్రపంచానికి మరింత నష్టంగా పేర్కొన్నారు. అందువల్ల హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కన్నా వాక్సిన్ ద్వారానే కరోనాను పూర్తిగా సురక్షితంగా నిరోధించాలని ఆమె తెలిపారు. అందువల్ల మరో ఏడాది పాటు కరోనాపై పోరుకు ప్రజలు సిద్ధం కావాలని డబ్ల్యూహెచ్వో సూచిస్తుంది.

Related News