logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

జాక్ మాను జైళ్లో వేశారా..? కార‌ణం ఇదేనా..?

ప్ర‌పంచంలోని అత్యంత సంప‌న్నుల్లో ఆయ‌న ఒక‌రు. ఆయన జీవితం యువ‌త‌కు ఆద‌ర్శం. టెక్నాల‌జీ, ఈకామ‌ర్స్ రంగాల‌కు మార్గ‌ద‌ర్శి ఆయ‌న‌. ల‌క్ష‌ల కోట్ల‌కు అధిప‌తి. అలీబాబా అనే ఈకామ‌ర్స్ సంస్థ‌ను స్థాపించి ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ‌ల్లో ఒక‌టిగా నిలిపిన వ్యాపార వేత్త ఆయ‌న‌. అతని పేరు జాక్ మా. చైనాలో అత్యంత ధ‌నికుడు. ఇంతగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న జాక్ మా ఇప్పుడు అదృశ్య‌మ‌య్యారు. రెండు నెల‌లుగా ఆయ‌న జాడ తెలియ‌డం లేదు.

అస‌లు జీవించి ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న‌ను చైనా ప్ర‌భుత్వం జైళ్లో వేసింద‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఏ దేశంలో అయినా ఒక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్ర‌భుత్వం గౌర‌విస్తుంది. ఉపాధి క‌ల్పించాల‌ని, పెట్టుబ‌డులు పెట్టాల‌ని ప్రోత్స‌హిస్తుంది. కానీ, చైనాలోనే పెద్ద వ్యాపార‌వేత్త అయిన జాక్ మాపై చైనా ప్రభుత్వం క‌క్ష క‌ట్టింది.

గ‌త ఏడాది అక్టోబ‌రు 24న చైనా ప్ర‌భుత్వానికి, అక్క‌డి బ్యాంకుల‌కు వ్య‌తిరేకంగా జాక్ మా కొన్ని విమ‌ర్శ‌లు చేశారు. ఈ విమ‌ర్శ‌లు చైనా ప్ర‌భుత్వానికి ఆగ్ర‌హం తెప్పించాయి. అప్ప‌టి నుంచే జాక్ మాపై క‌క్షసాధింపు చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్‌పై చైనా ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. అలీబాబా కంపెనీపై విచార‌ణ ప్రారంభించింది. ఫ‌లితంగా జాక్ మా ఆస్తులు సుమారు 80 వేల కోట్ల వ‌ర‌కు క‌రిగిపోయాయి.

అంతేకాదు, జాక్ మాను దేశం విడిచి వెళ్లొద్ద‌ని సైతం అక్క‌డి ప్ర‌భుత్వం ఆదేశించింది. అప్ప‌టినుంచి జాక్ మా క‌నిపించ‌డం లేదు. రెండు నెల‌లుగా ఆయ‌న జాడ లేక‌పోయినా చైనా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు. చైనా ప్ర‌భుత్వంతో విభేదాల కార‌ణంగానే జాక్ మా జాడ లేకుండా పోయింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చైనా నియంతృత్వ వైఖ‌రి గురించి తెలిసిన వారు అస‌లు జాక్ మా జీవించి ఉన్నాడా అనే అనుమానాల‌ను వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో ఇలా వ్యాపార‌వేత్త‌లు అదృశ్యం అవ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలోనూ కొంద‌రు వ్యాపారులు అదృశ్యం కాగా, మరికొంద‌రు దేశం వ‌దిలి పారిపోయారు. చైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన వారు ఎంత‌టి వారైనా చైనా ప్ర‌భుత్వం విడిచిపెట్ట‌దు. క‌క్ష‌క‌ట్టి ప‌గ తీర్చుకుంటుంది. ర‌క‌ర‌కాల అభియోగాలు మోపి జైళ్ల‌లో వేస్తుంది. ఇప్పుడు జాక్ మాను కూడా జైళ్లో వేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అస‌లు విష‌యం మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. జాక్ మాకు మ‌న దేశానికి చెందిన పేటీఎం, స్నాప్‌డీల్‌, బిగ్‌బాస్కె‌ట్‌లో కూడా పెట్టుబ‌డులు ఉన్నాయి.

Related News