logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?

గోధుమ గడ్డి జ్యూస్ ను రోజా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు. అందుకే ఇళ్లలోనే ఈ గడ్డిని పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. మరి ఈ గడ్డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకుందాం..

ముందుగా గోధుమ గడ్డిలో ఉండే ఔషద గుణాలు పరిశీలిస్తే.. ఇందులో క్లోరోఫిల్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజు ఉదయాన్నే 30 ఎంఎల్ మోతాదులో ఈ జ్యూస్ ను తాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వైద్యుల అవసరం లేకుండానే పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా పైల్స్ వ్యాధితో బాధపడేవారికి ఇది దివ్య ఔషధంగా చెప్పవచ్చు.

ఈ జ్యూస్ వల్ల అజీర్థం, మలబద్ధకం, అసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉండటం వల్ల శరీరంలోని వాపును తగ్గిస్తుంది. అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులను అరికడుతుంది. ఫైబర్ కారణంగా ప్రేగుల్లో పేరుకున్న మలినాలను ఇది తొలగిస్తుంది. అల్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. క్లోరోఫిల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొత్త రక్తాన్ని అందిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ ను కణాలు ఎక్కువగా గ్రహించుకుంటాయి.

అందువల్ల ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు ఈ జ్యూస్ ను తాగాలి. గోధుమ గడ్డికి సంబందించిన పొడులు, ట్యాబ్లేట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయుర్వేదం మాత్రం ఫ్రెష్ జ్యూస్ ను తీసుకోవడమే మంచిదని సూచిస్తుంది. గోధుమ గడ్డిని ఎవరైనా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు.

చర్మంపై పై ముడతలు పడకుండా ఉండేందుకు, కళ్ళ కింద నల్లటి వలయాలు, మచ్చలను తొలగించుకోవడానికి కూడా ఈ జ్యూస్ వాడతారు. అందుకే ఎన్నో కాస్మెటిక్స్ ప్రాడక్ట్స్ లో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవాళ్ళలో రక్త హీనత సమస్యను తొలగిస్తుంది.

Related News