వాట్సాప్ లో మనల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ విషయాన్ని వాట్సాప్ మనకు చూపించదు. మనం వారికి పంపిన మెసేజిలు కూడా వారికి చేరవు. మనల్ని బ్లాక్ లిస్టులో ఉంచారన్న విషయం తెలియక పదే పదే మెసేజిలు చేయడం, కాల్స్ చేయడం చేసి సమయం వృథా చేసుకుంటాము. అయితే ఎవరైనా మనల్ని వాట్సాప్ లో బ్లాక్ చేస్తే ఆ విషయాన్ని కొన్ని చిన్న ట్రిక్స్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అందుకు థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ కాంటాక్ట్ లో ఉన్న మీ చాట్స్, మీడియా అలాగే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని బ్లాక్ చేసారన్న విషయం కనిపెట్టలేరు. వారి స్టేటస్ చూడలేరు. మీకు వారి లాస్ట్ సీన్ కనిపించదు. ఒక వేళ వారు ఆన్ లైన్ లో ఉన్నా మనం చూడలేము. చాట్ థ్రెడ్ లో ఆ కాంటాక్ట్ పేరు కింద ఉన్న ప్రదేశం లో ”ఆన్ లైన్” అని కాకుండా కాలీగా చూపుతుంది.
వారి ప్రొఫైల్ మీకు కనిపించదు. ప్రొఫైల్ పిక్ కూడా బ్లాంక్ గా ఉంటుంది. మిమ్మని బ్లాక్ చేసిన కాంటాక్ట్ కు మెసేజ్ చేస్తే సింగిల్ టిక్ మాత్రమే వస్తుంది. డబుల్ టిక్, బ్లూ టిక్స్ చూపదు. వాయిస్ మెసేజిలు, కాల్స్ కూడా వెళ్లవు.
ఇవి కాకుండా మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలియాలంటే ఆ కాంటాక్ట్ ను ఏదైనా గ్రూప్ లో యాడ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో ”యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు యాడ్ దిస్ కాంటాక్ట్” అనే మెసేజ్ కనిపిస్తే కచ్చితంగా వారు మీ కాంటాక్ట్ ను బ్లాక్ చేసారని గ్రహించాలి.