logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

యూజర్లకు శుభవార్త: వాట్సాప్ పే వచ్చేసింది..!

ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా యూజర్ల కోసం వాట్సాప్ లో ఆర్థిక లావాదేవీలు జరుపుకునే విధంగా వాట్సాప్ పే ను అందుబాటులోకి తెచ్చింది. అయితే వాట్సాప్ లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినివ్వడంతో ఇప్పుడు భారత్ లో వాట్సాప్ పే సేవలను ఉపయోగించుకునే వీలు కలిగింది.

దీనిపై మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియాలో తమ పాలుపంచుకోవడం తమకు గర్వంగా ఉందన్నారు. యుపిఐ తో భారత్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుందన్నారు. ఇకపై వాట్సాప్ ద్వారా డబ్బులను పంపించడం మెసేజిలు పంపినంత సులభతరం కానుందని తెలిపారు.

అందుకోసం యూజర్ల నుంచి ఎలాంటి చార్జీలు వసూలుచేయడం లేదని 140 పైగా బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలను జరుపుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల మేరకు దశలవారీగా భారత్ లో వాట్సాప్ పే సేవలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. యూజర్ల భద్రత కోసం వాట్సాప్ యూపీఐ విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. తొలివిడతగా దేశంలో రెండు కోట్ల మందికి ఈ సేవలను అందించనున్నామన్నారు.

Related News