logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

వాట్సాప్ డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఈ యాప్స్ ట్రై చేసి చూడండి!

జనవరి 5న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీపై దుమారం రేగుతుంది. 2021 ఫిబ్రవరి 8 లోపు ఈ రూల్స్ ను యూజర్లు అంగీకరించాలంటూ షరతులు విధించింది. తాము విధించిన డెడ్ లైన్ లోపు ఈ రూల్స్ ను అంగీకరించకుంటే వాట్సాప్ ఉపయోగించడం సాధ్యం కాదని వాట్సాప్ సంస్థ ప్రకటించింది. వాట్సాప్ సంస్థ పెడుతున్న ఈ షరతులపై కొన్ని రోజులుగా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్లు ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈ కొత్త ప్రైవసీ పాలసీలో ఏముందంటే .. ఈ రూల్స్ ను యూజర్లు అంగీకరిస్తే యూజర్ ఉపయోగిస్తున్న ఫోన్ మాడల్, ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ లెవల్, యాప్ వర్షన్, సిగ్నల్ స్ట్రెంగ్త్ , మొబైల్ నెట్వర్క్ వంటి వివరాలన్నీ సంస్థ సేకరిస్తుంది.

అంతే కాదు యూజర్ బ్రౌసింగ్ హిస్టరీ బాష, టైం జోన్, ఐపీ అడ్రెస్ లాంటి వివరాలు కూడా సంస్థ చేతికి వెళ్లిపోతాయి. యూజర్ల డేటాను వాట్సాప్ సేకరించడమే కాకుండా దానిని ఫేస్ బుక్ తో కూడా పంచుకుంటామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లంతా తమ డేటా దుర్వినియోగం అవుతుందని గగ్గోలు పెడుతున్నారు. వీలైనంత త్వరగా వాట్సాప్ స్థానంలో వేరే యాప్ ను ఉపయోగించాలని చూస్తున్నారు. దీంతో పలు మెసేజింగ్ యాప్ లకు భారీగా డిమాండ్ పెరిగింది. వాట్సాప్ తో పోటీ పడలేకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని మెరుగైన ఫీచర్లతో అందుబాటులో ఉన్న కొన్ని యాప్ లను లక్షలాది మంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అవేమిటో చూద్దాం..

టెలిగ్రామ్ :
వాట్సాప్ తర్వాత అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన మరో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్. వాట్సాప్ కన్నా తమ టెలిగ్రామ్ యాప్ సురక్షితమని ఆ సంస్థ చెప్పుకొస్తుంది. వాట్సాప్ లాగానే టెలిగ్రామ్ యాప్ లో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. ‘ఎం టీ ప్రోటో’ అనే ప్రోటోకాల్ ను ఉపయోగించడం వలన ఇది యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచుతుందని చెప్తున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ , ఐవోఎస్ ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంది. అయితే అంతా అనుకుంటున్నట్టుగా టెలిగ్రామ్ అనేది భారతీయ యాప్ కాదు రష్యన్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఈ యాప్ ను రూపొందించారు. రష్యా ఐటీ చట్టాలకు ఈ యాప్ విరుద్ధంగా ఉన్నందువలన ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా ఈ యాప్ కార్యకలాపాలకను కొనసాగిస్తోంది. ఇటీవల ఈ యాప్ లో కొని భద్రతాపరమైన లోపాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్లో ‘మీకు సమీపంలో ఉన్న ప్రజలు’ అనే అశం ద్వారా వ్యక్తుల కచ్చితమైన లొకేషన్ ను తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉన్నట్టుగా సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.

సిగ్నల్ యాప్ :
గత రెండు మూడు రోజులుగా టెలిగ్రామ్ తో పాటుగా సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన సిగ్నల్ ఫౌండేషన్ ఈ యాప్ ను రూపొందించింది. వాట్సాప్ కు కో ఫౌండర్ అయిన బ్రియాన్ ఆక్టన్ ఈ సిగ్నల్ ఫౌండేషన్ కు కూడా కో ఫౌండర్ గా ఉన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. మొబైల్ ఫోన్ తరహాలోనే సిగ్నల్ యాప్ లో కూడా నార్మల్ వాయిస్ కాల్స్ ను చేసుకోవచ్చు. ఇటీవలే వీడియో కాల్స్ ఫీచర్ ను కూడా యాప్ లో ప్రవేశ పెట్టారు. వాట్సాప్ లో మాదిరిగా సిగ్నల్ యాప్ లో కూడా గ్రూపులను పెట్టుకోవచ్చు. డిలేట్ ఫర్ ఎవ్రీ వన్, డిసప్పియరింగ్ మెసేజ్ లాంటి అప్షన్లు కూడా అబందుబాటులో ఉన్నాయి. చాట్ లో ఎమోజిలను కూడా చేర్చుకోవచ్చు.

త్రీమా :
త్రీమా అనేది ఒక ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. కాకపోతే ఇది పై యాప్. ఈ యాప్ లో కూడా ఎండ్ తో ఎండ్ ఎన్క్రిప్షన్, వాయిస్ కాల్స్, ఫైల్ షేరింగ్, గ్రూప్ చాట్స్ వంటి ఫెచర్స్ అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ లిస్టు క్లౌడ్ లో కాకుండా నేరుగా మీ ఫోన్ లో స్టోర్ చేస్తుంది. యూజర్లు 8 అంకెల త్రీమా ఐడీతో కమ్యూనికేట్ అవ్వచ్చు. వాట్సాప్ వెబ్ లాగా త్రీమా ఆప్ కూడా వెబ్ అప్షన్ ను అందిస్తుంది. దీంతో డెస్క్ టాప్ సైట్ లో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. టెక్స్ట్ మెసేజ్ తో పాటుగా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, చేసుకోవచ్చు. అలాగే మల్టీమీడియా, లొకేషన్ ను కూడా పంపించుకోవచ్చు.

వైబర్:
ఫీచర్ల విషయానికి వస్తే, వాట్సాప్ తో పోటీ పడగల సామర్థ్యం కూడా వైబర్ కు ఉంది. ఈ యాప్ మెసేజ్ లు, కాల్స్, షేర్ చేసే మీడియా ఫైల్స్ కి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సెక్యూరిటీ కల్పిస్తుంది. ఇందులో కూడా మల్టీపుల్ ప్లాట్ ఫాం ఫీచర్ అందుబాటులో ఉంది. మెసేజింగ్ ఫీచర్ల విషయానికి వస్తే, వైబర్ స్టిక్కర్లు, ఫైల్ షేరింగ్, లాస్ట్ సీన్, వాయిస్ మరియు వీడియో మెసేజ్ లు, గూగుల్ డ్రైవ్ కు బ్యాకప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వైబర్ గేమ్స్ అనే ఫీచర్ ద్వారా మీరు యాప్ లోనే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. వైబర్ లో దాదాపు వాట్సాప్ లో ఉండే ఫీచర్లే ఉంటాయి.

స్నాప్ చాట్:
టెక్నీకల్ గా చూస్తే స్నాప్ చాట్ అనే యాప్ కేవలం మెసేజింగ్ కోసం మాత్రమే కాకుండా సోషల్ మీడియా యాప్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో మెసేజిగ్ కు సంబందించిన ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. మెసేజ్ పంపిన కొన్ని నిమిషాల తర్వాత ఆ మెసేజ్ డిలేట్ అయ్యేలా చేసుకునే అప్షన్ ఉంది. మీ చాటింగ్ ను ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తే మీకు వెంటనే ఆ నోటిఫికేషన్ రావడం ఈ యాప్ లో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్. ఇవేకాకుండా గ్రూప్ చాట్స్, గ్రూప్ వాయిస్ కాల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వాట్సాప్, కాబట్టి చాట్ యాప్స్ కు సంబంధించి ఏవైనా ప్రత్యేక ఫీచర్లు కావాలి అనుకుంటే మీరు స్నాప్ చాట్ కు మారవచ్చు.

Related News