logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్.. వారికి షాక్!

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎలాంటి అనర్థాలను తెచ్చి పెడుతున్నాయో తెలిసిందే. ఈ నకిలీ వార్తల బెడద ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ యూజర్లకు అధికంగా ఉంటుంది. ఆ యాప్‌లో మెసేజ్‌లన్నీ ఎన్‌క్రిప్టెడ్ కావటం వల్ల వాట్సాప్ స్వయంగా మెసేజిలపై నిఘా ఉంచటం కానీ, కీవర్డ్స్ ఆధారంగా పసిగట్టటం కానీ చేయటం కుదరదు. అయితే ఫేక్ న్యూస్ ను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది.

తాజాగా కేంద్రం ఆదేశాల మేరకు నకిలీ వార్తలను ప్రచారం చేసేవారికి షాకివ్వనుంది. ఈ వార్తలను అరికట్టేందుకు నిబంధనలను మరింత కఠినం చేస్తుంది. అందుకోసం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వస్తుంది. వాట్సాప్ ద్వారా షేర్ అవుతున్న సమాచారం సరైనదా లేక నకిలీదా అనే విషయం యూజర్లు సులువుగా తెలుసుకునే విధంగా రివర్స్ సెర్చింగ్ ఆప్షన్ ను తీసుకు వస్తుంది. అంటే ఆ మెసేజీలను తిరిగి వెబ్ లో సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

అందుకోసం యూజర్లు తిరిగి గూగుల్ కు వెళ్ళవలసిన అవసరం లేదు. వాట్సాప్‌ నుంచే నేరుగా మెసేజ్‌ లేదా ఫొటోలను వెబ్‌లో సెర్చ్ చేసేందుకు యూజర్‌కు అవకాశం ఉంటుంది. నకిలీ టెక్స్ట్ మెసేజీలతో పాటుగా నకిలీ ఫోటోలను కూడా ఈ ఫీచర్ ఉపయోగించి కనిపెట్టవచ్చు. అందుకోసం యూజర్ తమకు ఏదైనా చాట్ నుంచి వచ్చిన ఫార్వర్డ్ మెసేజీని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.

ఆ తర్వాత పక్కన కనిపించే మూడు చుక్కల పైన క్లిక్ చేయాలి. వచ్చిన పాప్ అప్ బాక్స్ నుంచి ‘సెర్చ్‌వెబ్’‌ను సెలక్ట్‌ చేయాలి. దీంతో ఆ సమాచారాన్ని సంబంధించి ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా అరికట్టవచ్చు. అయితే టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ తేవారంలోనే యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

Related News