logo

  BREAKING NEWS

శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |   విద్యార్థులకు శుభవార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు!  |   కుప్పం కోటలు బద్దలు కొట్టారు.. మంత్రిపై సీఎం జగన్ ప్రశంసలు!  |   హాలీవుడ్‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ..?  |   బంగారం కొనేందుకు బెస్ట్ టైమ్‌.. 23.02.2021 బంగారం ధ‌ర‌లు  |  

తలపై ఒకే చోట జుట్టు రాలుతోందా? ‘అలొపేషియా’ అంటే ఏమిటి? చికిత్స సాధ్యమేనా?

తలమీద ఒకే ప్రాంతంలో ఉన్నట్లుండి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. జుట్టు రాలిన చోట చర్మం బయటకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి జుట్టు సన్నగా మారిపోతుంటుంది. దీనినే పేనుకొరుకుడు అంటారు. కానీ నిజానికి ఇది పేళ్లు కొరకడం వల్ల వచ్చేది కాదు. అందరికి అర్ధమయ్యేలా చెప్పేందుకు ఇలాంటి నానుడి పుట్టుకొచ్చింది. ఈ కండిషన్ ను వైద్య పరిభాషలో ‘అలోపీశియా ఎరిమేటా’ అంటారు. మన జనాభాలో రెండు శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

వీరిలోనే అధికంగా..

అలోపీశియా సమస్య అలర్జీ కారణంగా వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఆ అలర్జీ తగ్గిన వెంటనే తిరిగి అక్కడ జుట్టు రావడం మొదలవుతుంది. ఆడ, మగ సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. అయితే వయసు రీత్యా చూస్తే 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలో అధికంగా కనిపిస్తుంది. 60 సంవత్సరాలు దాటిన వారిలో దాదాపు ఈ సమస్య ఉండదు. ఒక్క తలలోనే కాదు ఈ సమస్య శరీరం అంతా ఈ అలర్జీ వ్యాపించగలదు. కొందరికి తలలో, కాళ్ళు, చేతులు, కను బొమ్మలు, గెడ్డం ఇలా వివిధ ప్రాంతాల్లో గుండ్రటి భాగంలో జుట్టు రాలిపోతుంది.

కారణాలు..

అలోపీశియా సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. కొందరిలో వంశ పారంపర్యంగా ఈ సమస్య ఉంటుంది. కవలల్లో ఒకరికి ఉంటె మరొకరికి కూడా ఉంటుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. శరీరం తనను తాను రక్షించు కోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోయి తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఖాళీలు ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. మానసిక ఆందోళన ∙థైరాయిడ్‌ సమస్య డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది

చికిత్స ఉందా?

చాలా మంది ఈ సమయ ఉన్నవారు బట్టతల వచ్చినట్టుగా అపోహ పడుతుంటారు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన అక్కడ జుట్టు రాదని ఎలాంటి చికిత్స చేయించుకోకుండానే వదిలేస్తుంటారు. కానీ ఈ సమస్యకు నిర్దిష్ట కారణాలు తెలుసుకోవడం ద్వారా దీనికి చికిత్సను అందించి మంచి ఫలితాలను పొందవచ్చు. వైద్యులను సంప్రదిస్తే ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్‌ పరీక్షలు, పిగ్మెంట్‌ ఇన్‌కాంటినెన్స్‌ వంటివే మరికొన్ని పరీక్షల ద్వారా ఈ సమస్యను గుర్తిస్తారు.స్టెరాయిడ్స్. లేజర్ చికిత్స, ఆయింట్ మెంట్ల ద్వారా =చికిత్స చేస్తారు. అటు హోమియోపతి వైద్యంలోను అలోపీశియాకు చికిత్స ఉంది. కొంత మందిలో చాలా తక్కువ సమయంలో దీనికి పరిష్కార లభిస్తుంది. మరికొంత మందికి చాలా రోజులు పట్టవచ్చు కానీ ఓపికతో పాజిటివ్ గా ప్రయత్నిస్తే అలోపీశియా నుంచి తప్పకుండా బయటపడవచ్చు.

 

 

 

 

 

 

Related News