logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా లక్షణాలున్నా టెస్టుల్లో నెగిటివ్ వస్తుందా? ఆలస్యం చేయకుండా ఈ టెస్టు చేయించుకోండి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండో దశలో లక్షణాలు లేకుండానే వైరస్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మరో వైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో సైతం గందరగోళం నెలకొంది. కొంత మందిలో కరోనా లక్షణాలు ఉండి పాజిటివ్ ఉన్న వారికి కూడా కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడం జరుగుతుంది. దీంతో వీరు కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారి మరింత మందికి వైరస్ వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది.

చాలా మంది కరోనా పరీక్షల కోసం యాంటిజెన్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఆర్టీపీసీఆర్ తో పోలిస్తే యాంటిజెన్ టెస్టుల్లో అరగంటలోనే ఫలితం వస్తుంది. అయితే ఈ టెస్టుల్లో ఖచ్చితత్వం ఉండటం లేదు. పాజిటివ్ ఉన్న వారికి కూడా కొన్ని సార్లు ఈ టెస్టుల్లో నెగిటివ్ చూపుతుంది.

85 శాతం ఖచ్చితత్వంతో ఉండే ఆర్టీపీసీఆర్ టెస్టులది కూడా ఇదే పరిస్థితి. గతంలో ఏ చిన్న పాటి లక్షణం ఉన్నా ఆర్టీపిసిఆర్ టెస్టులో తెలిసిపోయేది. పరీక్ష ఫలితాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ట్రీట్మెంట్ మొదలు పెట్టిన వెంటనే బాధితులు 95 శాతం కోలుకునే వారు. కానీ ఇప్పుడు ఆర్టీపిసిఆర్ టెస్టుల్లో కూడా పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ గా చూపుతుంది.

కొంత మందిలో కరోనా వైరస్ నోరు, ముక్కు ద్వారా సోకకుండా ఇతర మార్గాల ద్వారా వ్యాపించినప్పుడు వైరస్ ఆనవాళ్లు స్వాబ్ పరీక్షల్లో నమోదు కావడం లేదని వైద్యులు అంటున్నారు. మరో విధంగా వైరస్ కొత్త వేరియంట్లలో మార్పులు జరగడం, ప్రజల నుంచి సేకరించిన శ్వాబ్ ను నిల్వ చేయడంలో నిర్వహణా లోపాల కారణంగా కూడా ఈ విధంగా తప్పుడు ఫలితం వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

సాధారణంగా లక్షణాలు మొదలైన ఏడు రోజుల లోపు అయితే ఆర్టీపీసీఆర్ మెథడ్‌‌లో, ఏడు రోజులు దాటితే యాంటీ బాడీ మెథడ్‌‌లో టెస్ట్ చేయొచ్చు. యాంటీ బాడీ టెస్టులో నెగిటివ్ వస్తే, ఆర్టీపీసీఆర్ మెథడ్‌‌లో టెస్ట్‌‌ చేయించాలి. కరోనా లక్షణాలు ఉండి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వస్తుంటే మాత్రం వారు కచ్చితంగా సీటీ స్కాన్ చేయించుకోవాలని లేదంటే వైద్యుల సలహా మేరకు ఛాతి ఎక్సరే తీయించాలని నిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం, జలుబు లాంటి కరోనా లక్షణాలుంటే పరీక్షల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరిస్తున్నారు.

Related News