logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

రైతుల ఉద్యమంలో ఏమిటీ ‘టూల్ కిట్’ వివాదం.. దిశా రవిని ఎందుకు అరెస్టు చేసారు?

కేంద్రం తెచ్చిన న్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా కూడా కొందరు ప్రముఖులు మద్దతు తెలిపారు. అందులో స్వీడన్ కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్ కూడా ఉన్నారు. రైతు దీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గ్రెటా థెన్‌బర్గ్ ఒక టూల్‌కిట్ ను షేర్ చేశారు. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు.

జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా బెంగుళూరుకు చెందిన 22 ఏళ్ల దిశా రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కూడా అవే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటికీ మూల కారణం టూల్ కిట్. అసలు ఏమిటీ టూల్ కిట్ దీనిపై అంతర్జాతీయంగా వివాదం తలెత్తడానికి గల కారణాలేమిటి? అందులో దిశా రవి పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం..

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు మొదలయ్యాయి. అమెరికాలో బ్లాక్ లైవ్ మాటర్, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూలకు సంబంధించి న ప్రణాలికను కాగితం రూపంలో ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపేవారికి చేరేలా చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్ కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమమైనా అందుకు సంబందించిన ఒక డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్ కిట్ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు ఎవరైనా ఈ టూల్ కిట్ లో లభించే యాక్షన్ ప్లాన్స్ ను ఫాలో అవ్వచ్చు. అంటే ఈ ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తుంది అనే సమాచారం ఇందులో తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఈ టూల్ కిట్ ను ఆ ఉద్యమానికి మద్దతు లభిస్తుందని భావించే సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్ కిట్ చాలా కీలకంగా ఉంటుంది. ఇదే టూల్ కిట్ ప్రధాన ఉద్దేశ్యం కూడా.

అయితే రైతులకు మద్దతుగా గ్రెటా థన్ బర్గ్ షేర్ టూల్ కిట్ ను దిశ రవి ఎడిట్ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దిశా రవి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. ఆమెపై దేశద్రోహం కేసులు నమోదు చేసారు పోలీసులు. టూల్ కిట్ లోని రెండు మూడు లైన్లను ఎడిట్ చేసిన దిశా రవి ఆ తర్వాత అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయంటూ తిరిగి గ్రేటాకు ట్వీట్ చేసింది. రైతుల కు మద్దతివ్వడం కోసం ఇలా చేసానని ఆమె విచారణలో వెల్లడించారు.

22 ఏళ్ల దిశ రవి బెంగళూరులోని మౌంట్ కామెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో గ్రెటా థన్ బర్గ్ ప్రారంభించిన పర్యావరణ కార్యకర్తల గ్రూపులో ఈమె కూడా సభ్యురాలు. 2019లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా విభాగాన్ని ఆమె ప్రారంభించింది. పర్యావరణ మార్పులపై పలు ప్రచారాలను ఆమె చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కేసు విచారణలో భాగంగానే తాజాగా దిశ రవిని అరెస్ట్ చేశారు.

 

Related News