logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏమిటి? చికిత్స ఉందా?

జీవక్రియలో అవసరమైన ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్. ప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మగవారిలో 1.5 శాతం మందికి మాత్రమే ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో 59 మంది మిలియన్ల మంది జనాభా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా మందికి ఈ సమస్య ఉన్న విషయం కూడా తెలియదు. థైరాయిడ్ సమస్య చిన్న పిల్లలో కూడా తలెత్తవచ్చు. అది వారిలో పెరుగుదల లోపాలకు కారణమవుతుంది. థైరాయిడ్ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోతే ఇది శరీరంలో అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. శరీర బరువు, జుట్టు ఊడటం, సంతానలేమి, సెక్సువల్ డిస్ ఫంక్షన్, మానసిక అనారోగ్యం వంటి సమస్యలు చుట్టుముడతాయి. సరైన సమయంలో మందులు వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. లేకపోతే ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. .

థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపర్ థైరాయిడిజం. మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతో పాటుగా అవయవాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఈ గ్రంథి సరిగ్గా విధులు నిర్వహించినపుడు సమస్య ఏర్పడుతుంది. అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను విడుదల చేసినపుడు అది హైపర్ థైరాయిడిజం కు కారణమవుతుంది. శరీరంలో టీ3, టీ4 తగ్గడం వలన హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. ఇవి రెండు ఆరోగ్యానికి నష్టం కలిగించేవే.

కారణాలు:
సాధారణంగా అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004 కు ముందు వరకు భారత్ లో ఇలాంటి అనేక కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు భారత్ అయోడిన్ లోపాన్ని అధిగమించింది. జనాభాలో దాదాపు 90 శాతం మంది అయోడిన్ ఉన్న ఉప్పుని వాడుతున్నారు. అయితే రకరకాల వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడాల్సిన రోగ ఇనిరోధక శక్తి వివిధ కారణాల వల్ల అంతర్గత అవయవాలతో పోరాడాల్సి వస్తుంది. అంతే కాకుండా వాహన,పారిశ్రామిక కాలుష్యం కూడా థైరాయిడ్ సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుంది.

హైపో థైరాయిడిజం లక్షణాలు:
థైరాయిడ్ గ్రంథి అవసరానికన్నా తక్కువ హార్మోన్లు విడుదల చేస్తుంటే దానిని హైపో థైరాయిడ్ అంటారు. హైపో థైరాయిడిజం సమస్య ముఖ్యంగా 30-50 సంవత్సరాల వయస్సు వారిలో అధికంగా కనిపిస్తుంది. ఉన్నట్లుండి బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారిపోవడం, విపరీతమైన అలసట, మహిళలల్లో రుతుక్రమం తప్పడం, సంతానలేమి వంటివి ఈ హైపోథైరాయిడ్‌ లక్షణాలు.

హైపర్ థైరాయిడ్ లక్షణాలు:
థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు దానిని హైపర్ థైరాయిడ్ అని అంటారు. 30 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ దశలో శరీరం కొన్ని లక్షణాలను కనబరుస్తుంది. ఆకలి బాగా వేస్తుంది. కానీ బరువు తగ్గుతారు. కోపం, చిరాకు, నీరసం కలుగుతాయి. విపరీతమైన చమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒకటే టెన్షన్, కాళ్ళు చేతులు వణకడం, ఎక్కువ వేడిని భరించలేకపోవడం చెమటలు పట్టడం నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి.

నిర్దారణ పరీక్షలు, చికిత్స :
థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా మేరకు నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ ను T3, T4, TSH పరీక్ష, థైరాయిడ్ యాంటీ బాడీలు, అల్ట్రా సౌండ్ ద్వారా గుర్తిస్తారు. మందుల ద్వారా ఈ హార్మోన్లను బ్యాలన్స్ చేసేవిధంగా చికిత్స అందిస్తారు.

Related News