logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పీఆర్సీ, ఫిట్‌మెంట్, ఐఆర్ అంటే ఏమిటి ?

తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది. తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కేసీఆర్ తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పలు చోట్ల ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. అసలు ఇంతకీ పిఆర్సీ, ఫిట్ మెంట్ అంటే ఏమిటి? వీటి వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం..

పీఆర్సీ అంటే వేతన సవరణ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పదవీ విరమణ పొంది ఫించన్ అందుకునే వారికి నిర్ణీత కాలం త‌ర్వాత వేత‌నాల‌ను‌ సవరిస్తారు. అయితే వారికి ఎంత జీతం ఇవ్వాలి? అలవెన్సులు(భత్యం) ఎంత ఇవ్వాలి అనే విషయాలను పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా వేతనాల పెంపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ నివేదిక ఆధారంగానే జీత భత్యాలు పెంచాలనే నిబంధన ఏమీ ఉండదు. నిజానికి కమిటీ సూచించిన దానికన్నా ఎక్కువనే ప్రభుత్వాలు చెలిస్తుంటాయి.

ఇక ఫిట్ మెంట్ విషయానికొస్తే.. నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు జీతాల పెంపు ఉంటుంది. దీనినే ఫిట్ మెంట్ అంటారు. వేతన సవరణలో భాగంగా పెరిగిన జీతాలకు ఫిట్ మెంట్ ను కూడా కలిపి చెల్లిస్తుంది ప్రభుత్వం. కేంద్ర ఉద్యోగులకు పదేళ్లకు ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకు ఒకసారి వేతనాల్లో సవరణలు ఉంటాయి. ఉద్యోగికి అప్పటి వరకు ఉన్న డీఏను, ఫిట్ మెంట్ గా చెల్లించే మొత్తాన్ని కలుపుకుని కొత్త మూలవేతనాన్ని నిర్దారిస్తారు. అందుకోసం ఒక నిర్దిష్టమైన పే స్కేల్ ఉంటుంది. దీనికి ఇతర అలోవెన్సులను కూడా జోడించి నెల జీతాన్ని చెల్లిస్తారు.

Related News