logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

తెలంగాణలో అమలులోకి కొత్త జోనల్ విధానం.. అంటే ఏమిటి?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేసే విధంగా రూపొందించిన కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇందుకు సంబందించిన గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోమ్ శాఖ జారీ చేసింది. దీంతో త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గ్రూప్- 2, గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఇక గ్రూప్ 1, ఇతర క్యాటగిరీల్లోని పోస్టులకు నోటిఫికేషన్ రాక దాదాపు 10 ఏళ్ల గడిచింది. జోనల్ అంశాలతో ముడిపడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

కొత్త జోనల్ విధానం అమలు కావడం పట్ల అటు నిరుద్యోగులు, విద్యార్థులతో పాటుగా ఉద్యోగ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాత జోనల్ విధానంలో సాంకేతికపరమైన అస్పష్టత ఉండేది. దీంతో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతులు, బదిలీలు కూడా ఆగిపోయాయి. మరో వైపు గ్రూప్ 1 సహా పలు కీలకమైన పోస్టుల భర్తీ కూడా నిలిచిపోయింది.

కొత్త జోనల్ విధానంలో స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పాత జోనల్ విధానంలో జిల్లా కేడర్ పోస్టుల్లో 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్, జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీల వారికి రిజర్వేషన్లు కల్పించారు. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులకు స్థానికులకు రిజర్వేషన్ లేకపోవడంతో తెలంగాణ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం జరిగిందేనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

గతంలో ఖాళీగా ఉన్న 3 వేల పోస్టులతో పాటుగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను కలుపుకుని మొత్తం 4 వేల పోస్టుల భర్తీ చేపట్టనుంది ప్రభుత్వం. అదే విధంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన 50 వేల పోస్టులకు కూడా ఈ కొత్త విధానం అమలు కానుంది.

దీంతో ఓపెన్ కేటగిరీల్లో స్థానికేతరులకు కేవలం 5 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండనున్నాయి. అయితే వీటికి కూడా స్థానికులు పోటీ పడవచ్చు. కొత్త జోనల్ విధానం ప్రకారం.. ఏయే పోస్టులు ఏయే మల్టీ జోన్ల పరిధిలోకి వస్తాయి. వివరాలు, సర్వీసు నిబంధనల ప్రకారం రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

 

 

 

Related News