logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

హలాల్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

మాంసం విక్రయించే షాపుల దగ్గర ఇది వంద శాతం హలాల్ చేయబడినది అని రాసి ఉంటుంది. చాలా మంది మాంసం కొనుక్కునే వారు ఇది హలాల్ చేసిందా? అని అడిగి మరీ తీసుకుంటారు. కొన్ని నిబంధనల ప్రకారం షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లలో వారు అమ్ముతున్న మాంసం హలాల్ చేసిందా లేదా జట్కా పద్ధతిలో అమ్ముతున్నారా అనేది కన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఈ ఆదేశాలు చికెన్ లేదా మరేదైనా మాంసం అమ్మే ప్రతి షాపుకు వర్తిస్తుంది. స్టాండింగ్ కమిటీ చేసిన ఈ ప్రపోజల్ ను త్వరలోనే చట్టంగా మార్చే పనిలో ఉన్నారని సమాచారం.

ప్రతి మతంలోనూ మాంసం కోసం జంతువులను వధించడానికి కొన్ని ప్రత్యేక పద్దతులను పాటిస్తారు. యూదులు కోషెర్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. కోషెర్ చేసిన మాంసాన్ని ముస్లిములు తినరు. అలాగే హిందువులు, సిక్కులు హలాల్ చేసిన మాంసాన్ని తినరు. జట్కా పద్దతిలో వధించిన జంతువుల మాంసాన్ని మాత్రమే తింటారు. ఇలా ఒక్కొక్కరు వారి మత ఆచారాల ప్రకారం ఆయా పద్ధతుల్లో జంతువుల మాసాన్ని సేకరిస్తారు. కానీ మనకు ఎక్కువగా వినిపించే పేరు హలాల్. హలాల్ చేయడం వలన కొందరు ఇతర మతస్థులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అసలు హలాల్ అంటే ఏమిటి? హలాల్ కు జట్కా పద్దతికి మధ్య తేడా ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.

హలాల్ అనేది అరబిక్ పద్ధతిలో ఇస్లాం చట్ట ప్రకారం తినేందుకు అనుమతి ఉన్న ఆహారం. హలాల్ చేసే జంతువు లేదా కోడిని కోసేటప్పుడు అది ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ప్రాణాలతో ఉండాలి అలాంటి ఆహారాన్నే తినాలని జంతువు రక్తాన్ని మాంసంతో కలపవద్దని ఖురాన్ చెప్తుంది. అలా చేయని మాంసాహారం ముస్లిం మతస్థులు తినరు. మక్కా వైపుగా జంతువు ముక్కని ఉంచి గొంతు కోస్తారు. ఆ జీవిలో ఉన్న రక్తం మొత్తం తీసేస్తారు. ఆ సమయంలో ప్రత్యేక మంత్రం చదువుతారు. దాని అర్థం ఆ పాపం మాది కాదు అని. అయితే ఇలా చేయడాన్ని కొందరు హిందువులు, సిక్కులు వ్యతిరేకిస్తారు. హలాల్ విధానం వల్ల ఆ జీవి నరకయాతన అనుభవిస్తూ చనిపోతుందని అలాంటి మాంసం భుజించిన వారిలో సున్నితత్వం నశిస్తుందని కొందరు వాదిస్తారు.

జంతువులను వధించడానికి ఉపయోగించి మరో పద్ధతినే జట్కా అంటారు. ఉత్తర, దక్షిణ భారత్ లోని హిందువులు గ్రామ దేవతలు, ఇతర కార్యక్రమంలో జంతువులను జట్కా పద్దతిలో వధిస్తారు. జట్కా పద్ధతిలో మాత్రం జంతువు, కోడి లాంటి వాటిని ఒక్క వేటుతోనే మెడ నుంచి తలను వేరు చేస్తారు. ఇలా చేయడం వలన ఆ జీవికి నొప్పి తెలియకుండా ఉంటుందని అంటారు. అయితే కొందరికి కొన్ని పద్దతుల ద్వారా ఉన్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని మాంసం విక్రయదారులు వారు ఏ పద్ధతిని పాటించారో తెలిపేందుకు షాపుల ముందు బోర్డులను ఉంచుతారు. ఇతర మతస్థుల నమ్మకాలను గౌరవిస్తారు.

 

 

 

 

 

 

Related News