logo

  BREAKING NEWS

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |  

గౌట్ అంటే ఏమిటి? సర్జరీ అవసరమా? గౌట్ సమస్యను తగ్గించే పరిష్కారాలు!

గౌట్ అనేది ఒక రకమైన కీళ్ల వ్యాధి. మన శరీరంలో యూరిక్ ఆసిడ్ జీవక్రియలు సరిగా లేకపోతే ఈ సమస్య ఏర్పడుతుంది. యూరిక్ ఆసిడ్ ,రక్తంలో ఉండాల్సిన పరిణామం కన్నా ఎక్కువగా ఉంటె అది కీళ్ళలోకి చేరుతుంది. అప్పుడు కీళ్ళు వాచీ, కదలికలు కూడా కష్టమవుతాయి. ఈ కండిషన్ నే గౌట్ గా పిలుస్తారు.

ఈ సమస్య ఉన్నవారిలో కాలి బొటన వేలి దగ్గర వాపు, జాయింట్ల దగ్గర నొప్పికలుగుతుంది. కాళీ వేలి దగ్గర హఠాత్తుగా నొప్పి వస్తుంది. ఈ అటాక్స్ వచ్చేటప్పుడు అక్కడ మండిపోతున్నటుగా అనిపిస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకోకపొతే జాయింట్స్ దగ్గర గడ్డలు ఏర్పడతాయి. అది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

మధ్యవయసు పురుషులు, మోనోపాజ్ దాటిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటె కూడా వస్తుంది. కిడ్నీ సమస్యలు, థైరాయిడ్, హైబీపీ, డయాబెటిస్, అధిక బరువు సమస్యలు ఉన్నవారిలో. ఆల్కహాల్ అతిగా తీసుకునేవారిల్ కూడా గౌట్ ఏర్పడుతుంది.

కొన్ని సందర్భాలలో ఈ సమస్య లక్షణాలు బయటకు కనిపించవు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరిలో లక్షణాలు బయటకు తెలుస్తాయి. మొదటి దశలో కాలి బొటన వేలి దగ్గర మంటగా ఉంటుంది. ఆ తర్వాత మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్ళు కూడా ప్రభావితమవుతాయి.

ఈ సమస్యనుంచి బయటపడాలంటే ఆహారంలో మాంసకృత్తులను బాగా తగ్గించి తీసుకోవాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముకలు, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి.

గౌట్ ని వెంటనే ట్రీట్ చేయకపోతే అది ఆర్థ్రైటిస్ గా మారుతుంది. దీని వల్ల జాయింట్స్ పర్మినెంట్‌గా డామేజ్ అయిపోతాయి. ఈ సమస్యకు సర్జరీ అవసరం లేకపోయినప్పటికీ కొన్ని ఏళ్ళ తరవాత ఇది జాయింట్స్ ని డ్యామేజ్ చెయ్యవచ్చు. టోఫస్ ఏర్పడితే సర్జరీ ద్వారానే దాన్ని రిమూవ్ చేయాల్సి రావచ్చు. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలూ, అల్లం, యాపిల్ సైడర్ వెనిగర్, సెలెరీ, టార్ట్ చెర్రీస్ వంటి ఆహార పదార్ధాలు బాడీలో పేరుకున్న యూరిక్ ఆసిడ్ వంటివి తీసుకోవడం వల్ల గౌట్ ఏర్పడటానికి కారణమయ్యే యూరిక్ ఆసిడ్ లెవల్స్ ను తగ్గిస్తాయి. .

Related News