logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?

భూటాన్.. పెద్దగా ఆయుధ సంపత్తి లేని చిన్న దేశం. భారత్ కు అత్యంత కీలకమైన భూభాగం భూటాన్ తో ముడిపడి ఉంది. అందుకే ఈ చిన్న దేశంపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తుంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా కన్ను ఇప్పుడు మరోసారి ఆ దేశంపై పడింది. భూటాన్ భూభాగంపై చైనా దురాక్రమణలకు పాల్పడుతుంది. దాని ద్వారా చైనా భారత్ లోకి చొరబడే అవకాశం ఉంది. తాజాగా చైనా భూటాన్ భూభాగంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకుని పోయి అక్కడ ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. అందుకు సంబందించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేసాడు. ఆ తరువాత కొద్ది సమయానికే వాటిని తొలగించారు. కానీ అప్పటీకే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజాగా భూటాన్ ఈ వార్తలను ఖండించింది. తమ భూభాగంలో చైనా ఎలాంటి గ్రామాన్ని ఏర్పాటు చేయలేదని చెప్తుంది. అయితే చైనా మాత్రం అందుకు సాక్ష్యాలుగా ఫోటోలను కూడా బహిర్గతం చేయడం విశేషం. కాగా ఈ వార్తలపై భారత్ మండిపడుతుంది. భారత్ – చాలా మధ్య 72 రోజుల పాటు డోక్లామ్ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా తాము ఆక్రమించామని చెప్తున్న గ్రామం డోక్లామ్ ప్రాంతానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో చైనా భారత్- భూటాన్ లను ఆక్రమించుకునేందుకు వ్యూహరచన చేస్తుందన్న అనుమానాలకు బలం చేకూరుతుంది. భూభాగాలను ఆక్రమించుకోవడానికి చైనా ‘సలామీ స్లైసింగ్’ అనే విధానాన్ని అమలు చేస్తుండటం భారత్ కు మరింత ఆందోళనకరంగా మారింది.

అంటే ఐదు వేళ్ళ వ్యూహం. చైనా తన సరిహద్దు దేశాలను ఆక్రమించుకోవడానికి ఈ విధానం అమలు చేస్తుంది. టిబెట్ ను కుడి చేయిగా భావించి లఢక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ లను ఐదు వేళ్ళ లాగా భావిస్తుంది. దీనినే నేపాల్ లో అమలు చేసి ఆ దేశంలోని భూభాగాన్ని కూడా డ్రాగన్ దేశం ఆక్రమించిందని సమాచారం. సలామీ స్లైసింగ్ వ్యూహాన్ని అమలు చేయడంలో చైనా దిట్ట. ఇతరులెవరికీ కనీసం అనుమానం రాకుండా శత్రుదేశాలపై రహస్యంగా సైనిక చర్యలను పలు దఫాలుగా అమలు చేస్తుంది. చిన్న చిన్న విషయాలను వివాదాస్పదం చేయడం, ఆ తర్వాత బెదిరింపులు, హెచ్చరికలతో ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలిపేసుకోవడం బీజింగ్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ విధానం అంత తేలికైనది కాదు. అందుకు సుదీర్ఘకాలం పాటు వేచి చూస్తుంది. చివరకు శత్రుదేశం ప్రతిస్పందించేలోపే వారి భూభాగాలను అతి సున్నితంగా తమ పరం చేసుకుంటుంది.

ఆ తర్వాత వాటిపై సుదీర్ఘ కాలంపాటు వివాదాలు చేసి చివరకు అంతర్జాతీయ సమాజం ముందు బాధిత దేశాన్నే దోషిగా నిలబెడుతుంది. ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో చైనా ఎన్నో మెళుకువలు నేర్చుకుంది. ఇలాగే గతంలో అరుణాచల్, సిక్కింలోని కొని ప్రాంతాలను కూడా కలిపేసుకుంది. 1974లో వియత్నాం నుంచి “పారాసెల్‌ దీవు” లను ఇదే వ్యూహంతో సొంతం చేసుకుంది. 1988లో “జాన్సన్‌ రీఫ్‌” లను కూడా ఇలాగే కలిపేసుకుంది. 1995లో ఫిలిప్పైన్స్‌, వియత్నాంల భూభాగాన్ని ఇదే పద్దతిలో ఆక్రమించుకుంది.

ఈ విధానం వల్ల నేరుగా దేశాల మధ్య యుద్ధం రాకపోయినా ఆయా దేశాలు చైనా ధాటికి తమ భూభాగాలను కోల్పోతుండటం మాత్రం తప్పడంలేదు. ఇప్పుడు భారత్, భూటాన్ విషయంలోనే అదే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే డోక్లామ్ సమయంలో చైనా వ్యూహాలతో విసిగి వేసారిన భారత్ ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేలా చేసి చైనాకు కళ్లెం వేసింది. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. చైనా దురాక్రమణలపై భారత్ మండిపడుతోంది. సార్క్ దేశాలు భూటాన్ కు అండగా ఉండాలని భారత్ పిలుపునిచ్చింది.

Related News