logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

పెళ్ళికి లోన్ కావాలా?.. సులభంగా ఇలా పొందండి!

పెళ్లిళ్లకు కూడా లోన్ ఇస్తారా? అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా యువత తమ పెళ్ళిళ్ళను ఘనంగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు పెళ్లంటే బ్యాచిలర్ పార్టీలు, సంగీత్ లు, రెసెప్షన్ ఇలా అనేక కార్యక్రమాలు తప్పనిసరిగా మారాయి. ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్లకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో సెలెబ్రెటీలకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు అంతటా కనిపిస్తుంది.

ఇలా నేటితరం పెళ్లి కళను సాకారం చేయడానికి కొన్ని బ్యాంకులు వెడ్డింగ్ లోన్స్ ఇస్తున్నాయి. ఈ లోన్ పొందే ప్రక్రియ కూడా చాలా సులభం.పెళ్ళికి లోన్స్ ఇచ్చే బ్యాంకులలో ఎస్బీఐ బ్యాంకు కూడా ఒకటి. ఈ బ్యాంకు పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారికి తక్కువ వడ్ఢేకీ లోన్ ఇస్తుంది. ఇందులో వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. మీ సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్ ఇస్తారు. ఇలా తీసుకునే లోన్స్ పర్సనల్ లోన్స్ తో సమానం.

అయితే ఈ లోన్స్ విషయంలో వసూలు చేసే ఇంట్రెస్ట్ రేటు మాత్రం పర్సనల్ లోన్స్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. 21 నంచి 65 సంవత్సరాల లోపు వారు ఎవరైనా ఈ వెడ్డింగ్ లోన్స్ తీసుకోవచ్చు. అయితే వారు కచ్చితమైన ఆదాయ మార్గాలను కలిగి ఉండాలి. డాక్యుమెంటేషన్ కోసం ఇన్కమ్ సెర్టిఫికెట్, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లాంటి ప్రూఫ్స్ ను సబ్మిట్ చేయాలి. తీసుకున్న లోన్ ను 5 నుంచి 7 సంవత్సరాల వ్యవధిలో చెల్లించుకోవచ్చు. ఈ లోన్ కోసం యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవాలి.

అయితే పెళ్లిళ్లకు లోన్ తీసుకునే వారు ముందుగా వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న మ్యారేజ్ లోన్స్ తో వాటిని సరి చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు అధిక వడ్డీలు వసూలు చేస్తుంటాయి. నెలవారీ ఈఎంఐలు ఎంత చెల్లించగలరో ముంచే నిర్ణయించుకోండి. కొన్ని బ్యాంకులు జాయింట్ వెడ్డింగ్ లోన్స్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వీటిని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీసుకోవచ్చు. అయితే ఏ ఒక్కరు చెల్లించకపోయినా ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Related News