logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కాజల్ అగర్వాల్ పెళ్లి ఫిక్స్.. అబ్బాయి ఎవరంటే?

దక్షణాది సినిమాల్లో దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే కాజల్ సోదరి నిషా అగర్వాల్ ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. కాజల్ వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండటంతో పెళ్ళికి ఇంకా సమయం ఉందంటూ చెపుకొచ్చేది.కాగా కొంత కాలంగా కాజల్ డేటింగ్ లో ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాజల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో నిజమే అన్నటుగా పోస్టులు పెట్టింది. ఆ మధ్య వీరిద్దరూ కలిసి లండన్ కు హాలిడే ట్రిప్ కు వెళ్లారంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్ళికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ కాజల్ పెళ్లాడబోయే ఆ అబ్బాయి ఎవరంటే.. ఔరంగాబాద్ కు చెందిన వ్యాపార వేత్తగా తెలుస్తుంది. త్వరలోనే కాజల్ తన పెళ్లిపై అధికారిక ప్రకటన కూడా చేయనుందట.

ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ తో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది. అలాగే మంచు విష్ణు తో ‘మోసగాళ్లు’ అనే సినిమాలో కూడా కనిపించనుంది. తమిళంలో శంకర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్ ‘ఇండియన్ – 2’ సినిమా కూడా పూర్తికావస్తోంది. వీటితో పాటుగా కాజల్ ఒక బాలీవుడ్ సినిమా కూడా సైన్ చేసింది.

Related News