logo

  BREAKING NEWS

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |  

రాత్రిపూట సాక్సులు ధరించి నిద్రపోతే జరిగే అద్భుతాలు ఇవే!

శరీరం, మెదడు పనితీరు చురుకుగా ఉండాలంటే కంటినిండా సరైన నిద్ర చాలా అవసరం. మనం నిద్రిస్తున్నా మన శరీరంలోని అంతర్గత అవయవాలు పని చేస్తూనే ఉంటాయి. మన మెదడు మాత్రం మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాతనే స్పష్టంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అయితే కంటినిండా నిద్ర పోయినప్పుడు మాత్రమే మెదడు చురుకుగా పనిచేస్తుంది. లేదంటే పని పై ఫోకస్ పెట్టలేము. అందుకే రోజుకు కనీసం 7నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. అయితే నిద్రపోవడానికి ఒక వైద్యురాలు ఇచ్చిన సలహా ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

రాత్రి పూట సాక్స్ ధరించి నిద్రపోతే చిటికెలో గాఢ నిద్రలోకి వెళ్తారని ఆసక్తికర విషయం చెప్పారు. సాక్స్ ధరించడం వలన పాదాలు వేడెక్కుతాయి. ఫలితంగా శరీరం అప్రమత్తమై శరీరాన్ని చల్లబరిచే రక్తనాళాలను తెరుచుకునేలా చేస్తుంది. శరీరం చల్లబడటం వల్ల ఇది నిద్రపోయే సమయమని మెదడుకు సంకేతాలు అందుతాయి. ఇది మిమ్మల్ని గాఢ నిద్రలోకి వెళ్లేలా చేస్తుంది అని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ విషయం కొత్తదేమీ కాదు.

2006లో ఫిజికల్ బిహేవియర్ అనే జర్నల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. రాత్రి పూట కాళ్లకు సాక్సులు ధరించి పడుకోవడం వలన హాయిగా నిద్ర పట్టడమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రించే సమయంలో కాళ్ళలో రక్తప్రసరణ లేకవడం కారణంగా సిరల్లో వాపు వస్తుంది. అది క్రమంగా కాళ్ళ నొప్పులకు దారి తీస్తుంది. మరికొందరిలో కాళ్లలో తిమ్మిర్లు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి వేళ కాటన్ సాక్సులను ధరించడం వలన రక్తప్రసరణ మెరుగై నిద్రకు ఆటంకం లేకుండా చేస్తుంది.

మహిళల్లో ముఖ్యంగా మోనోపాజ్ దశలో వేడి ఆవిర్లు, చమటలు పట్టడం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వారు సాక్సులు ధరించి నిద్రపోతే శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట సాక్సులు ధరించి నిద్రపోయే జంటలు సంతోషకరమైన సెక్స్ జీవితాన్ని అనుభవిస్తారని తేలింది. అయితే మీరు ధరించే సాక్సులు మరీ బిగుతుగా ఉంటె ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వదులుగా ఉండి సౌకర్యవంతమైన సాక్సులనే ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related News