logo

  BREAKING NEWS

‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |  

కరోనాను అదుపు చేయగల శక్తి దానికి మాత్రమే ఉంది.. ఈ చిన్న తప్పు చేయకండి

కరోనా మహమ్మారిని కట్టడి చేయగల వాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. భారత్ లో వచ్చే ఏడాది జనవరిలోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలుజరుగుతున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వాక్సిన్ ప్రజలకు కరోనా సోకకుండా పూర్తి స్థాయిలో రక్షణ ఇస్తుందా లేదా అనే విషయంపై శాస్త్రవేత్తల దగ్గర కూడా కచ్చితమైన సమాధానం లేదు.

ఒక వేళ ఈ వాక్సిన్ వలన జనాభాలో 75 శాతం మందికి రక్షణనివ్వగలిగితే అది చాలా సంతోషకరమైన విషయమని అంటున్నారు. ఇప్పుడు అందుబాటులోకి రానున్న వాక్సిన్లలో కనీసం 50 శాతం మందికైనా రక్షణ లభిస్తుందని రుజువైతేనే వాటికి లైసెన్సులు ఇస్తామని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికా లోని సెంటర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

కరోనాకు ఇప్పుడు వస్తున్న వాక్సిన్ ల కన్నా కూడా ఈ వైరస్ ను అదుపు చేయగల శక్తి మాస్కులకు మాత్రమే ఉందన్నారు. వాక్సిన్ లతో పోలిస్తే మాస్కులు ధరించడమే అత్యత్తమ మార్గమన్నారు. శాస్ర్తీయంగా ఉన్న ఆధారాలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. వాక్సిన్ ల వల్ల కరోనా పూర్తిగా రాదనే గ్యారెంటీ లేదు. కానీ మాస్కును సరైన విధంగా ధరించడం వలన వంద శాతం వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చన్నారు. మాస్కులు మొక్కుబడిగా ధరించడం వల్ల మాత్రం ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అంటున్నారు శాస్త్రవేత్తలు.

అయితే చాలా మంది మాస్కు ధరించడంలో చేసే పొరపాట్లను తెలుపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. మాస్కులను మాటిమాటికి తాకుతూ సరిచేయడం, వదులుగా ధరించడం, ఒకరి మాస్కును మరొకరు ధరించడం చేయరాదు. అలాగే ముక్కు కిందకు మాస్కు ధరించడం, మాట్లాడేటప్పుడు మాస్కును తొలగించడం వంటి చిన్న పొరపాట్లే ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.

 

 

Related News