వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది వాట్సాప్ సంస్థ. ఈ నేపథ్యంలో గతంలో ఉండే టెక్స్ట్ స్టేటస్ ను పూర్తిగా తొలిగించి దానిస్థానంలో స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేసుకునే విధంగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
మనం స్టేటస్ గా పెట్టుకునే వాటిని ఇతరులు చూస్తే అది మనకు కింద ‘రీడ్ రెసీప్ట్స్’ ద్వారా చూపిస్తుంది. కానీ మనకు తెలియని వారు కూడా మన స్టేటస్ ను చూస్తారు. కానీ అది మనకు తెలియదు. మనకు తెలియకుండా మన వాట్సాప్ స్టేటస్ ను చూడటం కోసం చాలా మంది వాట్సాప్ లో ఒక ట్రిక్ ను వాడుతుంటారు. మీరు కూడా ఈ ట్రిక్ ను ఒకసారి ట్రై చేయండి.
వాట్సాప్ లో సెట్టింగ్స్ అప్షన్ లోకి వెళ్లి అక్కడ ‘అకౌంట్’ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ప్రైవసీ అప్షన్ చూపుతుంది. అందులో రీడ్ రేసీప్ట్స్ అనే అప్షన్ దగ్గర ఉన్న చెక్ బాక్స్ ను డిసేబుల్ చేయడం ద్వారా అవతలి వ్యక్తి వాట్సాప్ స్టేటస్ ను మీరు చూస్తున్నవిషయం వారికి తెలియకుండా చూసేయొచ్చు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. ఈ చెక్ బాక్స్ ను డిసేబుల్ చేస్తే ఎవరెవరు మీ స్టేటస్ చూసారో మీకు కూడా చూపించదు మరి.