logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ఇండియాకు పబ్జి.. యూజర్లు ఈ తప్పులు చేస్తే అంతే!

భారత్ పబ్జి గేమ్ ను అధికారికంగా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. భారత యూజర్ల డేటాను చైనా సర్వర్లలో స్టార్ చేసుకుంటుందన్న కారణంతో భారత్ ఈ గేమ్ ను నిషేదించింది. తిరిగి ఇండియాలో దీనిని పబ్జి మొబైల్ ఇండియా పేరిట లాంచ్ చేయనున్నట్టుగా ఆ సంస్థ పేర్కొంది. ఈ వార్త తెలిసి పబ్జి లవర్స్ తెగ సంతోషిస్తున్నారు. ఈ గేమ్ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. అయితే పబ్జీ యూజర్లకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు నిపుణులు.

ఈ యాప్ తిరిగి భారత్ లో అందుబాటులోకి వస్తుందన్న వార్త తెలిసి కొందరు కేటుగాళ్లు నకిలీ లింకులు సృష్టించి వీటిని క్లిక్ చేసి ట్యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ లింకులను క్లిక్ చేస్తే ఎలాంటి గేమ్ డౌన్ లోడ్ కావడం లేదని వదిలేస్తున్నారు. కానీ అప్పటికే వాటిలో అమర్చిన ప్రమాదకరమైన మాల్ వేర్ మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది.

మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ లో పలు యాప్ లు డౌన్ లోడ్ అవుతాయి. అవి మీ ఫోన్ లో ఉన్న డేటాను దొంగిలించి అనర్థాలను తెచ్చి పెడతాయని అంటున్నారు. కాబట్టి పబ్జి పేరిట కనిపించే లింకులు దూరంగా ఉండటమే మంచిది. పబ్జి గేమ్ యూజర్లకు అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అందుకు వచ్చే ఏడాది 2021 ఫిబ్రవరి వరకు సమయం ఉంది.

 

Related News