వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాద చోటు చేసుకుంది. అతి వేగంతో ఓ కారు కెనాల్ లోకి దూసుకెళ్లింది. తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా కారు డ్రైవర్ ను స్థానికులు రక్షించారు. కాగా మృతుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తెలుస్తుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో ఎస్సారెస్సి కెనాల్ లోకి తెల్లవారుజామున ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చింది.
ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతులు ముగ్గురు చివరి వరకు ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు డోరు తీసుకుని ఇద్దరు బయటకు వచ్చారు అయినా నీటి ప్రవాహం కారణంగా ఒడ్డుకు చేరుకోలేకపోయారు. మరో వ్యక్తి కారులోనే చిక్కుకుని మరణించాడు.
కారు డ్రైవర్ మాత్రం కొంత దూరం ఈదుకుంటూ వచ్చి స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణంగా తెలుస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.