logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!

రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరోసారి రసాభాసగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారాం మధ్య మాట యుద్ధం నెలకొంది. నిన్న పంట నష్టం పై టీడీపీ సభను అడ్డుకున్న విషయంతెలిసిందే. ఈరోజు టిడ్కో ఇళ్లపై వైసీపీ- టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది.

సభను పదే పదే అడ్డుకోవడం సరికాదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సమయంలో స్పీకర్ వైపు చంద్రబాబు వేలు చూపించి మాట్లాడటంతో స్పీకర్ మండిపడ్డారు. సభాధ్యక్షుడినే బెదిరిస్తారా అంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

చంద్రబాబు మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలన్నారు. అదే సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై కూడా స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మీ శాపనార్థాలకు భయపడేది లేదని, నీ దగ్గర నీతులు నేర్చుకోవలసిన అవసరం లేదంటూ చంద్రబాబుపై స్పీఎకర్ నిప్పులు చెరిగారు.

Related News