logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

భారత్ బయోటెక్ టీకా తీసుకున్న వాలంటీర్ మృతి..?

కరోనా వాక్సిన్ పై దేశమంతా ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రపంచం. ఈ వాక్సిన్ తో కరోనాను అంతం చేయవచ్చని అంతా భావిస్తున్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా 90 శాతం సత్ఫాలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ టీకా తీసుకున్న ఓ వాలంటీర్ మరణించడం ఇప్పుడు కలకలంగా మారింది.

గతేడాది వాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా డిసెంబర్ 21 న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాక్సిన్ తీసుకున్న వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
భోపాల్ కు చెందిన దీపక్ మరవి (45) గతేడాది డిసెంబర్ నెలలో కరోనా వాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకోవడానికి పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు.

డిసెంబర్ 12 న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్ లో జరిగిన ట్రయల్స్ లో వాక్సిన్ తీసుకున్నాడు. వాక్సిన్ తీసుకున్న 10 రోజులకే ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంపాలై మృతి చెందాడు. వాక్సిన్ తీసుకున్న తర్వాత మరవి అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 17న భుజం నొప్పితో బాధపడ్డాడని ఆ తర్వాత రెండు రోజులకే నోటి నుంచి నురగలు వచ్చాయన్నారు.

ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 21 వ తేదీ మరణించాడు అని వారు వెల్లడించారు. అయితే అతనికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్య అధికారులు మాత్రం మరవి మరణానికి కారణం విష ప్రయోగం అయ్యుంటుందని అంటున్నారు. విసెర పరీక్ష ద్వారా అతని మరణానికి కారణం తెలుసుకోవచ్చన్నారు.

Related News