logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

విశాఖ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి?

విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో పరిశ్రమలో నలుగురు సిబ్బంది ఉన్నట్టు ప్రాథమికంగా నచ్చానా వేశారు. అందులో కెమిస్ట్ నాగేశ్వర రావు (40) మృతి చెందినట్టుగా గుర్తించారు.

ఎప్పటిలాగే అయన నిన్న రాత్రి పది గంటల షిఫ్టుకు వెళ్లారు. షిఫ్ట్ ప్రారంభమైన కోడికి సమయానికే ఈ పేలుడు సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. కాగా మంగళవారం ఉదయం శిథిలాల కింద పూర్తిగా కాలిపోయిన మృతేహాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులు గాని యాజమాన్యాలు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. పేలుడు ఘటనలోనే నాగేశ్వర్ రావు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి మల్లేష్(33) ను గాజువాక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ సాల్వెంట్‌ కంపెనీ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసి తిరిగి ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. వ్యర్థాలను శుద్ధి చేసే క్రమంలో కంపెనీలో ఉన్న ఐదు కాలమ్‌లలో ఒక కాలమ్‌లో పేలుడు జరిగి, మంటలు ఎగసిపడ్డాయి. మొత్తం 15 రసాయన డబ్బాలు పేలాయని తెలుస్తుంది.

కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 15 మంది వరకు సిబ్బంది ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద స్థలం నుంచి 5 కిలో మీటర్ల మేర పొగ చుట్టుముట్టడంతో స్థానికులు ప్రజలు నధోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలను అనుమతించడం లేదు.

Related News