బెజవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. గురువారం దివ్య తేజస్విని అనే యువతిని స్వామీ అనే యువకుడు ఆమె నివాసంలో కత్తితో గొంతు కోసి హత్య చేసాడు. అనంతరం తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు. తాజాగా ఈ కేసులో దివ్య సోదరుడు సంచలన విషయాలు బయటపెట్టాడు. స్వామి ఎవరో తమకు తెలియదని మృతురాలి తల్లిదండ్రులు చెబుతుండగా స్వామీ కి తన సోదరి దివ్య కొద్ది రోజుల క్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నారని తెలిపాడు.
వీరిద్దరి వివాహం దివ్య తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో దివ్యను బలవంతంగా గృహ నిర్బంధం చేసినట్టు సమాచారం. నిందితుడు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అందుకు సాక్ష్యంగా దివ్య తాళి బొట్టుతో స్వామితో ఉన్న ఫోటోలను పోలీసులకు చూపించాడు. వీరిద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే నిన్న కూడా ఇదే విషయమై స్వామికి దివ్య తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో దివ్యను తనకు దక్కకుండా చేస్తారనే భయంతో ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కొద్దీ రోజుల క్రితం వీరిద్దరూ కలిసి ఓ వివాహానికి కూడా హాజరయ్యారు. ఆ సమయంలో సంతోషంగానే కనిపించారు. ఇంతలోనే స్వామీ ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.